'పాకిస్థాన్ ప్రపంచకప్ గెలిస్తే చూడాలని ఉంది'

హైదరాబాద్: మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా ఆరంభమయ్యే వన్డే వరల్డ్‌కప్‌లో భారత జట్టుతో పాటు పాకిస్థాన్ కూడా సెమీఫైనల్స్‌కు చేరుతుందని ఆ దేశ్ పేస్ బౌలర్ వాహబ్ రియాజ్ అంటున్నాడు. వరల్డ్‌కప్ నేపథ్యంలో ఈ మెగా టోర్నీలో ఏయే జట్లు సెమీఫైనల్స్‌కు వెళతాయో ఇప్పటికే పలువురు మాజీ క్రికెటర్లతో పాటు క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం
తాజాగా జియో టీవీకి ఇచ్చిన ఇంటర్యూలో పాక్ పేసర్ వాహబ్ రియాజ్ మాట్లాడుతూ భారత్, పాకిస్థాన్‌తో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు సెమీస్‌కు చేరతాయని చెప్పుకొచ్చాడు. "నా ఫేవరేట్ టీమ్ పాకిస్థాన్, పాకిస్థాన్ జట్టు విజేతగా నిలవాలని కోరుకుంటున్నాను. సర్ఫరాజ్ నేతృత్వంలో పాకిస్థాన్ ప్రపంచకప్ గెలిస్తే చూడాలని ఉంది" అని రియాజ్ అన్నాడు.

పాక్ బలంగా ఉంది
"ఈ సారి మా జట్టు బలంగా ఉంది. ఈ మెగా టోర్నీలో మంచి ప్రదర్శన కనబరుస్తుంది. పాకిస్థాన్‌తో పాటు ఇండియా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లు సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి" అని వాహబ్ రియాజ్ పేర్కొన్నాడు. కాగా, ప్రస్తుతం ఆ జట్టు ప్రస్తుతం వన్డే ర్యాంకింగ్స్‌లో ఆరోస్థానంలో ఉంది.

ఇమ్రాన్‌ఖాన్ కెప్టెన్సీలో
చివరిగా ఇమ్రాన్‌ఖాన్ కెప్టెన్సీలో 1992లో ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారి వరల్డ్ కప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. వరల్డ్‌కప్ మెగా టోర్నీకి ముందు పాకిస్థాన్ జట్టు ఆప్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ జట్లతో మే 24, 26 తేదీల్లో వార్మప్ మ్యాచ్‌లు ఆడనుంది. ఇక, టోర్నీలో భాగంగా మే 31న వెస్టిండీస్‌తో తొలి మ్యాచ్ ఉండగా ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్‌తో జూన్ 3న రెండో మ్యాచ్ ఆడనుంది.

0-3తో కోల్పోయిన పాక్
ఇదిలా ఉంటే, వరల్డ్‌కప్‌కు ముందు ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు వన్డేల సిరిస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే పాకిస్థాన్ 0-3తో కోల్పోయింది. శుక్రవారం నాటింగ్‌హామ్ వేదికగా జరిగిన నాలుగో వన్డేలో ఇంగ్లాండ్ 3 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌పై విజయం సాధించింది.

జేసన్ రాయ్ సెంచరీ
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టులో బాబర్ ఆజం (112 బంతుల్లో 115; 13 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో చెలరేగా.. ఫఖర్ జమాన్(50 బంతుల్లో 57; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), మొహమ్మద్ హఫీజ్ (55 బంతుల్లో 59; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 340 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో జేసన్ రాయ్ (89 బంతుల్లో 114; 11 ఫోర్లు, 4 సిక్సర్లు), బెన్ స్టోక్స్ (64 బంతుల్లో 71 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో ఇంగ్లాండ్ 49.3 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 341 పరుగులు చేసి విజయం సాధించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications