వరల్డ్‌కప్: భార్యలు, ప్రియురాళ్ల విషయంలో బీసీసీఐ కొత్త నిబంధన

హైదరాబాద్: మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్‌కప్ జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వరల్డ్‌కప్‌లో ఆడే జట్టుని సైతం సెలక్టర్లు ప్రకటించారు. అయితే, ఈ వరల్డ్‌కప్‌కు భారత క్రికెటర్లు తమ వెంట భార్యలు, ప్రియురాళ్లను తీసుకుని వెళ్లే విషయంలో బీసీసీఐ కొత్త నిబంధన తీసుకొచ్చింది.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
సాధారణంగా టీమిండియా ఎప్పుడూ విదేశీ పర్యటనలకు వెళ్లినా క్రికెటర్లు తమ భార్యలను కూడా తీసుకెళ్తుంటారు. అయితే, ఇది ప్రతిష్టాత్మక వరల్డ్‌కప్ కావడంతో క్రికెటర్లతో పాటు ఆటగాళ్ల కుటుంబ సభ్యులు వెళ్లేందుకు బీసీసీఐ కొత్త నిబంధనను అమల్లోకి తీసుకొచ్చింది.

ఈ కొత్త నిబంధన వల్ల
ఈ కొత్త నిబంధన వల్ల మొత్తం 46 రోజుల పాటు జరిగే వరల్డ్‌కప్‌లో కేవలం 15 రోజులే వారితో గడిపే అవకాశం కుటుంబసభ్యులకు ఉంది. టీమిండియా స్వదేశాన్ని వదిలి వెళ్లిన 20రోజుల తర్వాత భారత ఆటగాళ్లు తమ భార్య, ప్రియురాళ్ల (వాగ్స్)తో కలిసి ఉండేందుకు అనుమతిస్తామని బీసీసీఐ వెల్లడించింది.

విదేశీ పర్యటన ఆరంభమైన
గతంలో విదేశీ పర్యటన ఆరంభమైన తొలి రెండు వారాల తర్వాత అనుమతించేవారు. అంతేకాకుండా ఇకపై మ్యాచ్‌ల సమయంలో స్టేడియాలకు వెళ్లేటప్పుడు ప్లేయర్స్ బస్‌లో కాకుండా మరో ప్రత్యేక వాహనంలో మాత్రమే వారంతా వెళ్లాల్సి ఉంటుంది. మే 22న ఇంగ్లాండ్ వెళ్లనున్న టీమిండియా టోర్నీ ఆరంభానికి ముందు రెండు వార్మప్ మ్యాచ్‌లను ఆడనుంది.

మే30 నుంచి వరల్డ్ కప్ ప్రారంభం
మే30 నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభమవుతుంది. లండన్‌లోని ఐకానిక్ ది ఓవల్ స్టేడియంలో జరగనున్న తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. ఈ వరల్డ్‌కప్‌లో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. రౌండ్ రాబిన పద్దతిలో జరిగే ఈ వరల్డ్‌కప్‌లో ఒక్కో జట్టు టోర్నీలోని మిగతా జట్లతో తలపడనుంది.

యునైటెడ్ కింగ్‌డమ్ ఆతిథ్యమివ్వడం ఇది ఐదోసారి
వన్డే వరల్డ్‌కప్‌కు యునైటెడ్ కింగ్‌డమ్ ఆతిథ్యమివ్వడం ఇది ఐదోసారి. యుకేలోని మొత్తం 11 వేదికల్లో 46 రోజుల పాటు మొత్తం 48 మ్యాచ్‌లు జరగనున్నాయి. జులై 14న జరిగే వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌కి ప్రఖ్యాత లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ ఆతిథ్యమివ్వనుంది. కోహ్లీసేన జూన్ 5న దక్షిణాఫ్రికాతో తన తొలి మ్యాచ్ ఆడనుందిట్టు. టోర్నీకే హై ఓల్టేజ్ మ్యాచ్‌గా నిలవనున్న భారత్-పాక్ మ్యాచ్ జూన్ 16న జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications