Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీ.. ధావన్ భార్యల మధ్య గొడవకు కారణం?

Kohli’s Wife Anushka And Dhawan’s Wife Ayesha Had A Querl In England
WAG feud? Kohli’s wife Anushka, Dhawan’s wife Ayesha had a fight in England: report

హైదరాబాద్: ఇంగ్లాండ్‌ పర్యటనలో భాగంగా టెస్టు సిరీస్ సమయంలో కోహ్లీ సేనతో అనుష్క శర్మ కనిపించింది. ఆ మధ్య వైరల్ అయిన ఫొటోపై అనేక విమర్శలు చెలరేగాయి. అయితే, తాజాగా ధావన్‌ భార్య ఆయేషా, అనుష్క మధ్య గొడవ జరిగిందనే విషయం సంచలనం రేపుతోంది. ధావన్‌ను జట్టు నుంచి తప్పించడంతో అనుష్క, ఆయేషా ఎడమొహం పెడమొహంగా ఉన్నారని ఓ పత్రిక పేర్కొంది.

జట్టు సమావేశాల సమయంలో కూడా అనుష్క అక్కడే ఉండేదని కూడా తెలిపింది. మ్యాచ్‌ల సమయంలో ఆటగాళ్ల భార్యలు, గాళ్‌ఫ్రెండ్స్‌ మంచి స్నేహితుల్లా కలసి పోవడం కనిపిస్తుంది. స్టాండ్స్‌ నుంచే ఆడేవాళ్లను ఉత్సాహపరుస్తారు. అలాంటి వారు కలహించుకున్నారంటే నమ్మశక్యం కావడం లేదని బోర్డు అధికారి ఒకరన్నారు. అనుష్క, ఆయేషా ఎంతో కాలంగా స్నేహితులని తెలిపారు.

లండన్‌లో జరిగిన రెండో వన్డేకు కోహ్లీనే వారికి పాస్‌లు ఇప్పించాడని చెప్పారు. అయితే, తమ మధ్య ఏమీ జరగలేదని ఆయేషా చెప్పినట్టుగా తెలిసింది. కానీ, ప్రస్తుతం వీరిద్దరూ మాట్లాడుకోవడం లేదని భోగట్టా. ఈ టెస్టు సిరీస్‌ను టీమిండియా 1-4తేడాతో ముగించింది. పర్యటన మొత్తంలో ఆడింది మూడు ఫార్మాట్‌లు అయినప్పటికీ గెలిచింది కేవలం టీ20 సిరీస్ మాత్రమే.

పర్యటన మొత్తంలో విరాట్ కోహ్లీ మినహాయించి అంతా ఫెయిలవ్వగా కోహ్లీ ఒక్కడే రాణించాడు. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ అనంతరం టీమిండియా వెస్టిండీస్‌తోనే టెస్టు మ్యాచ్‌లు ఆడేందుకు పూనుకుంది. ఈ క్రమంలో గురువారం మొదలైన టెస్టులో తొలిరోజు టీమిండియా దూసుకెళ్తోంది. ఈ క్రమంలో భారత్ 4 వికెట్ల నష్టానికి 364పరుగులు చేసింది.

Story first published: Friday, October 5, 2018, 10:40 [IST]
Other articles published on Oct 5, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+