For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్యాబ్ స్పెషల్: సౌరవ్ గంగూలీ తన లైఫ్ సేవర్ అని పిలిచేది ఎవరినో తెలుసా?

Laxman Shares Details Of Ganguly’s Early Days In Cricket Administration || Oneindia Telugu
VVS Laxman Wants Sourav Ganguly To Revive National Cricket Academy

హైదరాబాద్: క్రికెట్ ఆసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) సంయుక్త కార్యదర్శిగా సౌరవ్ గంగూలీ పనిచేస్తున్నప్పుడు అతడిని చూసి షాక్‌కు గురయ్యానని టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ తెలిపాడు. ఇటీవలే బీసీసీఐ అధ్యక్షుడిగా ఎంపికైన సౌరవ్ గంగూలీని బెంగాల్‌ క్రికెట్‌ అసోసియేషన్(క్యాబ్) శుక్రవారం ఘనంగా సన్మానించింది.

ఈ సన్మాన కార్యక్రమంలో మాజీ క్రికెటర్లు అజహరుద్దీన్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీవీఎస్ లక్ష్మణ్ మాట్లాడుతూ "భారత్‌ ఇంతలా రాణించేందుకు ప్రధాన కారణం రిజర్వ్‌ బెంచే. ఈ నేపథ్యంలో గంగూలీ ఇప్పుడు ఎన్‌సీఏకు మరింత ప్రాధాన్యమిస్తాడని ఆశిస్తున్నా" అని అన్నాడు.

దక్షిణాఫ్రికా క్రికెట్‌ పరిస్థితి ఆందోళనకరం

దక్షిణాఫ్రికా క్రికెట్‌ పరిస్థితి ఆందోళనకరం

"దక్షిణాఫ్రికా క్రికెట్‌ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఎందుకంటే వారి రిజర్వ్ బెంచ్ అంత పటిష్టంగా లేదు. అదే టీమిండియా విషయానికి వస్తే అందుకు భిన్నంగా ఉంది. మన దేశవాళీ క్రికెట్‌ అద్భుతంగా ఉండటతో మన రిజర్వ్ బెంచ్ పటిష్టంగా ఉంది. NCA ద్వారా, చాలా కాలం పాటు భవిష్యత్ ఛాంపియన్లను ఉత్పత్తి చేయవచ్చు. ఎప్పుడైతే రొటేషన్ అవసరమో వారితో ఆ స్థానాలను భర్తీ చేయొచ్చు" అని లక్ష్మణ్ తెలిపాడు.

గడ్డు పరిస్థితుల్లో గంగూలీ

గడ్డు పరిస్థితుల్లో గంగూలీ

"1999-2000 సీజన్‌లో టీమిండియా... ఆసీస్, దక్షిణాఫ్రికా చేతిలో ఓడింది. అలాంటి గడ్డు పరిస్థితుల్లో గంగూలీ జట్టులో ఆశావహ దృక్పథాన్ని పెంచాడు. కుర్రాళ్లు రాణించేందుకు ప్రేరణగా నిలిచాడు. కెప్టెన్‌గా, ఆటగాడిగా ఏదైతే సాధించాడో ఇప్పుడు బోర్డు పరిపాలకుడిగా కూడా అతను విజయవంతం అవుతాడు" అని చెప్పాడు.

బ్యాటింగ్‌ సలహాదారుడిగా

బ్యాటింగ్‌ సలహాదారుడిగా

ప్రస్తుతం క్రికెట్ ఆసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) ప్రాజెక్ట్‌ ‘విజన్‌ 2020' సలహాదారుడిగా పనిచేస్తోన్న లక్ష్మణ్... గంగూలీ సంయుక్త కార్యదర్శిగా ఉన్న సమయంలో బ్యాటింగ్‌ సలహాదారుడిగా ఇక్కడికి వచ్చానని... దాదా చిన్న గదిలో పనిచేస్తుండటాన్ని చూసి షాక్‌‌కు గురయ్యానని లక్ష్మమ్ తెలిపాడు.

అత్యంత విజయవంతమైన కెప్టెన్‌

అత్యంత విజయవంతమైన కెప్టెన్‌

"భారత కెప్టెన్లలో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌. కానీ, అతడు క్రికెట్‌ కోసం చిన్న గదిలో పని చేస్తుండటం చూసి ఆశ్చర్యపోయాను. అది నాకు ఎంతో ప్రేరణగా నిలిచింది. ప్రపంచ క్రికెట్‌లో దాదా ఒక లెజెండ్ అని మర్చిపోయినట్లు ఉన్నాడు. నువ్వు కోల్‌కతా యువరాజువి. సంయుక్త కార్యదర్శిగా తన బాధ్యతలను పరిపూర్ణంగా నిర్వర్తించాడు" అని లక్ష్మణ్ చెప్పుకొచ్చాడు.

అర్ధరాత్రి సమయాల్లో కూడా

అర్ధరాత్రి సమయాల్లో కూడా

"క్లిష్ట పరిస్థితుల్లో బెంగాల్‌ క్రికెట్ ఉన్నప్పుడు అతడు ఎంతో కష్టపడ్డాడు. అర్ధరాత్రి సమయాల్లో కూడా వాటి గురించే నాతో మాట్లాడేవాడు. ఇటీవల ప్రపంచకప్‌ సమయంలోనూ బర్మింగ్‌హామ్‌లో కలిసినప్పుడు నాతో, సెహ్వాగ్‌తో క్రికెట్ అభివృద్ధి గురించి చర్చించాడు. క్రికెట్‌ను అతడు ఎంతగా ప్రేమిస్తున్నాడో అప్పుడు నాకు అర్థమైంది' అని లక్ష్మణ్‌ తెలిపాడు.

అజహరుద్దీన్‌ మాట్టాడుతూ

అజహరుద్దీన్‌ మాట్టాడుతూ

అనంతరం అజహరుద్దీన్‌ మాట్టాడుతూ"గంగూలీ బోర్డు అధ్యక్షుడు కావడం చాలా సంతోషంగా ఉంది. అతని సారథ్యంలో భారత్‌ ఎన్నో టోర్నీలు గెలిచింది. కెప్టెన్‌గా ముందుండి భారత జట్టుని నడిపించినట్లే ఇప్పుడు అధ్యక్షుడిగా భారత క్రికెట్‌ను దాదా ముందుకు తీసుకెళ్తాడు. క్లిష్ట సమయాల్లో అతడు కఠిన నిర్ణయాలను తీసుకుని విజయవంతమయ్యాడు. నిబద్ధత కలిగిన వ్యక్తి బోర్డును కూడా సమర్థంగా నడిపిస్తాడు" అని అన్నాడు

వీవీఎస్‌ను నా లైఫ్ సేవర్ అని

వీవీఎస్‌ను నా లైఫ్ సేవర్ అని

కెప్టెన్‌గా తన కెరీర్‌ను వీవీఎస్ లక్ష్మణ్ నిలబెట్టాడని ఈ సందర్భంగా సౌరవ్ గంగూలీ పేర్కొన్నాడు. 2001లో ఈడెన్ గార్డెన్స్‌లో వీవీఎస్ స్పెషల్ ఇన్నింగ్స్‌ను దాదా గుర్తు చేసుకున్నాడు. "భారత క్రికెట్‌ను లక్ష్మణ్‌ బతికించాడు. ఈడెన్‌లో లక్ష్మణ్ చేసిన 281 పరుగులు టీమిండియాకే కాదు, నా కెప్టెన్ కెరీర్‌కు ఎంతో దోహదం చేశాయి. అందుకే వీవీఎస్‌ను నా లైఫ్ సేవర్ అని పిలుస్తాను"అని గంగూలీ చెప్పుకొచ్చాడు.

Story first published: Saturday, October 26, 2019, 11:58 [IST]
Other articles published on Oct 26, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+