For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

లక్ష్మణ్‌ను అనుమానించడమా?: సౌరభ్ గంగూలీ

By Nageswara Rao
VVS Laxman
లక్ష్మణ్‌పై ట్విట్టర్‌లో వాన్ చేసిన వ్యాఖ్యల పట్ల భారత మాజీ క్రికెటర్లు మండిపడ్డారు. వాన్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. లక్ష్మణ్ తనపై ఆరోపణలు చేసిన వాన్‌ను కోర్టుకీడ్చాలని ప్రస్తుత సిరీస్‌కు టీవీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న గవాస్కర్ సలహా ఇచ్చాడు. ఇక ఇటీవలే కామెంటేటర్ అవతారమెత్తిన గంగూలీ ఈ వ్యాజలైన్ వివాదాన్ని హాస్యాస్పదమ ని పేర్కొన్నాడు. టెస్టుల్లో నెంబర్‌వన్‌గా కొనసాగుతున్న భారత్ జట్టును మానసికంగా దెబ్బతీసేందుకు వాన్ అసంబద్ధమైన వ్యాఖ్యలు చేశాడని అన్నాడు.

'లక్ష్మణ్ బ్యాట్‌కు వేసలిన్ పూశాడని వాన్ ట్వీట్ చేయడం విడ్డూరంగా ఉంది. భారత్ క్రికెటర్లను ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు... ముఖ్యంగా లక్ష్మణ్‌ను ఇలా అనడం ఏమాత్రం సరికాదు. మైండ్‌గేమ్స్ ఆడటం ఇంగ్లండ్, ఆస్ట్రేలియాకు అలవాటే. నేను కెప్టెన్‌గా ఉన్నప్పుడు కూడా ఇలాంటివి ప్రయోగించారు. వీటిని భారత్ పట్టించుకోవద్దు. తమ నెంబర్‌వన్ సామర్థ్యాన్ని మైదానంలో చూపాలి. భారత్ టాపర్‌గా కొనసాగుతుండటం మిగతా ప్రపంచానికి ఇష్టం లేనట్టుంది" అని గంగూలీ ఘాటుగా వ్యాఖ్యానించాడు. వాన్‌ను కోర్టు కీడ్చే హక్కు లక్ష్మణ్‌కు ఉందని భారత మాజీ కెప్టెన్ గవాస్కర్ వ్యాఖ్యానించాడు. ఈ సమస్య పెద్దదయ్యే అవకాశముందన్నాడు.

''బంతి ఎడ్జ్‌ తీసుకున్నా లక్ష్మణ్‌ బతికిపోయాడంటే వేజలీనే కారణమా?'' అంటూ ట్విటర్లో పేర్కొనడం ద్వారా మైకేల్‌ వాన్‌ ఈ వివాదానికి తెరలేపాడు. ''బ్యాట్‌కు వేజలీన్‌ రాస్తే బంతి తాకినా హాట్‌స్పాట్‌లో 'మార్కు' కనిపించదు'' అన్నది అతనితో పాటు ఇంగ్లాండ్‌ ఆటగాళ్ల వాదన! హాట్‌స్పాట్‌లోని ఈ లోపం వల్లే లక్ష్మణ్‌ 27 పరుగుల వద్ద బతికిపోయాడని వారు నమ్ముతున్నారు. దీనిపై ఇంగ్లాండ్‌ జట్టు ఎలాంటి ఆరోపణలు చేయకున్నా.. మైదానంలో వారి ప్రవర్తన మాత్రం లక్ష్మణ్‌ను దోషిగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లే కనిపించింది. రివ్యూలో లక్ష్మణ్‌ నాటౌట్‌గా తేలడంపై ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. పీటర్సన్‌ అతని వద్దకెళ్లి ''నువ్వు ఔట్‌'' అన్నాడు. తర్వాత కూడా లక్ష్మణ్‌ను కవ్వించడానికి ప్రయత్నించాడు. ఇక ఆట ముగిశాక హాట్‌స్పాట్‌ విశ్వసనీయతనే ప్రశ్నిస్తూ నానా యాగీ చేశారు ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు. మరోవైపు తన వ్యాఖ్యలపై భారత మాజీలు భగ్గుమనడం, అన్నివైపులా విమర్శలు రావడంతో వాన్‌ మాట మార్చాడు. ''లక్ష్మణ్‌ వేజలీన్‌ రాశాడని నేను నిందించలేదు. నా వ్యాఖ్యలపై అతిగా స్పందిస్తున్నారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+