Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆసీస్‌కు కంటి మీద కునుకు లేకుండా చేశాడు: లక్ష్మణ్ ఐదు అత్యుత్తమ ఇన్నింగ్స్

హైదరాబాద్: బుధవారం (నవంబర్ 1)న టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ 43వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నాడు. అభిమానులు ముద్దుగా 'వెరీ వెరీ స్పెషల్' అని పిలిపించుకున్న లక్ష్మణ్ భారత క్రికెట్‌పై తనదైన ముద్ర వేశాడు. లక్ష్మణ్ పేరు చెప్పగానే ముందుగా గుర్తుకొచ్చేది ఈడెన్ గార్డెన్స్‌లో ఆస్ట్రేలియాపై చేసిన 281 పరుగుల చారిత్రాత్మక ఇన్నింగ్స్.

టీమిండియా ఫాలోఆన్ ఆడుతున్నప్పుడు రాహుల్ ద్రవిడ్‌తో కలిసి లక్ష్మణ్ అద్భుతంగా పోరాడాడు. అసాధారణమైన ఆటతీరుతో 281 పరుగులు చేసి భారత విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఆసీస్ బౌలర్లను ఎదుర్కోవడంలో ప్రపంచంలోని మిగతా బ్యాట్స్‌మెన్ ఇబ్బంది పడుతుంటే.. లక్ష్మణ్ మాత్రం అలవోకగా ఎదుర్కొనేవాడు.

2003లో అడిలైడ్ టెస్టులో లక్ష్మణ్ 148 పరుగులు చేయగా, రాహుల్ ద్రవిడ్ డబుల్ సెంచరీ సాధించి మరోసారి ఆస్ట్రేలియాకు కోల్‌కతా టెస్టు తరహా ఆటను చూపించారు. వీరిద్దరి అద్భుత బ్యాటింగ్ కారణంగా భారత్ 22 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఆసీస్ గడ్డపై టెస్టు విజయాన్ని రుచి చూసింది. దీంతో లక్ష్మణ్ పేరు క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది.

281 (Vs Australia, Kolkata, 2001)

281 (Vs Australia, Kolkata, 2001)

నిజంగా ఈ టెస్టు భారత క్రికెట్ చరిత్రలోనే నిలిచిపోతుంది. స్టీవ్ వా నేతృత్వంలోని ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులు చేసిన ఆలౌటైంది. అనంతరం భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 171 పరుగులకే ఆలౌట్ కావడంతో టీమిండియా ఫాలో ఆన్ అడింది. ఈ సమయంలో వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్‌లు కలిసి 376 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి 657 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేశారు. రెండో ఇన్నింగ్స్‌లో లక్ష్మన్ 281 పరుగులు చేయగా, ద్రవిడ్ 180 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌పై భారత స్పిన్నర్లు విజృంభించడంతో భారత్ 171 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

103 (Vs Sri Lanka, Colombo, 2010)

103 (Vs Sri Lanka, Colombo, 2010)

కొలంబో వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో కూడా వీవీఎస్ లక్ష్మణ్ అత్యుత్తుమ ఇన్నింగ్స్ ఆడాడు. ఆతిథ్య శ్రీలంకపై 257 పరుగుల విజయ లక్ష్యాన్ని చేధించడం అంత సులభం కాదు. కానీ, లక్ష్మణ్ సూపర్ ఇన్నింగ్స్‌తో అది సాధ్యమైంది. ఈ మ్యాచ్‌లో లక్ష్మణ్ 103 పరుగులతో సెంచరీ చేసి నాటౌట్‌గా నిలవగా, సురేశ్ రైనా 41 పరుగులతో నాటౌట్‌గా నిలిచి భారత విజయంలో కీలకపాత్ర పోషించారు. దీంతో అసాధ్యమనుకున్న ఈ మ్యాచ్‌లో ఆతిథ్య లంకపై భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

96 (Vs South Africa, Durban, 2010)

96 (Vs South Africa, Durban, 2010)

డర్బన్ వేదికగా దక్షిణాఫ్రికాపై లక్ష్మణ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. త్వరగా వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో పడగా.. 96 పరుగులు చేసి మ్యాచ్‌ను గెలిపించాడు. జహీర్ ఖాన్‌తో కలిసి 8వ వికెట్‌కు 70 పరుగులు జోడించాడు. కొద్దిలో సెంచరీని కోల్పోయినప్పటికీ భారత్ మ్యాచ్ గెలవడంలో మాత్రం లక్ష్మణ్‌దే కీలక పాత్ర.

73 (vs Australia, Mohali, 2010)

73 (vs Australia, Mohali, 2010)

2010లో మొహాలీలో జరిగిన టెస్టులోనూ లక్ష్మణ్ భారత జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. చివరి రోజు 216 పరుగుల లక్ష్యాన్ని చేధించే వేళ భారత్ 124 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. క్రీజులో లక్ష్మణ్ మినహా స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ ఎవరూ లేరు. వెన్ను నొప్పితో బాధపడుతూనే ఆ మ్యాచ్ ఆడిన లక్ష్మణ్ రైనాను తనకు బై రన్నర్‌గా నియమించుకున్నాడు. 9వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఇషాంత్ శర్మతో కలిసి భారత్‌కు విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో ఆసీస్ బౌలర్లు విసిరిన 130 బంతుల్లో 92 బంతులను ఇషాంత్ ధైర్యంగా ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత చివరి బ్యాట్స్‌మెన్ ఓజాతో కలిసి భారత్‌కు విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో లక్ష్మణ్ కేవలం 79 బంతుల్లోనే 73 పరుగులు చేయడం విశేషం.

148 (vs Australia, Adelaide, 2003)

148 (vs Australia, Adelaide, 2003)

ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలోనే నిలిచిపోయే మ్యాచ్ ఇది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 556 పరుగులు చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన భారత్ 85 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో ద్రవిడ్‌కు లక్ష్మణ్ జతకలిశాడు. 2001లో జరిగిన కోల్ కతా టెస్టుని గుర్తు చేశారు. వీరిద్దరూ కలిసి ఐదో వికెట్‌కు 303 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ మ్యాచ్‌లో లక్ష్మణ్ 148 పరుగులు చేయగా, రాహుల్ ద్రవిడ్ ఆసీస్‌పై డబుల్ సెంచరీ (233) చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో 11వేలకు పైగా పరుగులు సాధించిన లక్ష్మణ్‌ అందులో 3,173 పరుగులు ఆస్ట్రేలియాపైనే సాధించడం విశేషం.

Story first published: Monday, November 13, 2017, 12:18 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+