
రహానే ఉండాలి..
గురువారం నుంచి ఇరు జట్ల మధ్య ఓవల్ వేదికగా జరగనున్న నాలుగో టెస్ట్ నేపథ్యంలో ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫోతో మాట్లాడిన వీవీఎస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'అజింక్యా రహానే కచ్చితంగా అతని సామర్థ్యం మేరకు రాణించడం లేదు. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే రహానేను నేను ఈ జట్టు లీడర్‌గా చూస్తున్నాను. అతను టీమ్ కోర్ గ్రూప్‌లో ఒకడు. ఆస్ట్రేలియా పర్యటనలో 36 పరుగులకే ఆలౌటైన తర్వాత కెప్టెన్‌గా అతనేం చేశాడో మనందరికి తెలుసు.
మెల్ బోర్న్ వేదికగా అతను సెంచరీ.. ఆ పర్యటనలో భారత జట్టు పుంజుకునేలా చేసింది. అదో అద్భుతమైన ఇన్నింగ్స్. రహానే లాంటి ఎప్పుడైనా చెలరేగగలరు. అందుకే అతనిపై నాకు ఏ మూలనో నమ్మకం ఉంది. చివరి రెండు మ్యాచ్‌ల్లో అతన్ని కొనసాగించాలనేది నా అభిప్రాయం.'అని వీవీఎస్ చెప్పుకొచ్చాడు.

ఎక్స్ట్రా బ్యాట్స్‌మన్ అవసరం..
'భారత జట్టులో బ్యాటింగ్ విభాగం సామర్థ్యం మేరకు రాణించడం లేదు. గత మూడు మ్యాచ్‌ల్లో టీమిండియా మిడిలార్డర్ దారుణంగా విఫలమైంది. వాళ్లంతా ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌పై ఆధారపడుతున్నారు. కాబట్టి ఈ బలహీనతను అధిగమించేందుకు టీమిండియా మేనేజ్మెంట్ ఎక్స్ట్రా బ్యాట్స్‌మన్ తీసుకోవాలి. కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి ఈ దిశగా ఆలోచించాలి. ఇక స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను కూడా జట్టులోకి తీసుకోవాలి. ఎందుకంటే ఇంగ్లండ్ మిడిలార్డర్లో ముగ్గురు లెఫ్టాండ్ బ్యాట్స్‌మన్ ఉన్నారు'అని లక్ష్మణ్ చెప్పుకొచ్చాడు.

78 పరుగులకే ఆలౌట్..
వరుసగా రెండు మ్యాచ్‌ల్లో టాస్ ఓడిన విరాట్.. మూడో మ్యాచ్‌లో గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇక కొత్త బంతిని ఆడలేకపోయిన భారత బ్యాటింగ్ లైనప్ 78 పరుగులకే చుట్టేచేసింది. ముఖ్యంగా ఇంగ్లండ్ బౌలర్లు వేసిన ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్‌ను భారత బ్యాట్స్‌మన్ ఆడలేకపోయాడు. అయితే కీపర్ క్యాచ్ లేదంటే స్లిప్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరారు. ఓపెనర్లు మినహా మిగతా బ్యాట్స్‌మన్ పెద్దగా రాణించడం లేదు. మిడిలార్డర్లో ఎవరూ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చడం లేదు. ఈ క్రమంలోనే ఎక్స్ట్రా బ్యాట్స్‌మన్ తీసుకోవాలని మాజీలు సూచిస్తున్నారు.

సూర్య? విహారీ?
ఇక నాలుగో టెస్ట్‌లో టీమిండియా ఎక్స్ట్రా బ్యాట్స్‌మన్‌తో బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే టెస్ట్ స్పెషలిస్ట్ హనుమ విహారీ? లేక సూర్యకుమార్ యాదవ్ బరిలోకి దిగుతాడా? అనేదానిపై సందిగ్దత నెలకొంది. ఈ విషయంలో మాజీ క్రికెటర్లు సైతం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. హనుమ విహారీని తీసుకోవాలని కొందరంటే.. సూర్యకు అవకాశమివ్వాలని మరికొందరు అంటున్నారు. సూర్య ఇటీవల మంచి ఫామ్‌లో ఉన్నాడని, అతని రోహిత్, కేఎల్ రాహుల్ స్థాయి ఆటగాడని పేర్కొంటున్నారు. మరీ కెప్టెన్ కోహ్లీ ఏం చేస్తాడో చూడాలి.