న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2021: 'అన్ని ముందుస్తు జాగ్ర‌త్త‌లు తీసుకున్నా.. సాహాకు క‌రోనా ఎలా వ‌చ్చిందో అర్థం కావ‌డం లేదు'

VVS Laxman says SRH still surprised how Wriddhiman Saha got infected
IPL 2021 : SRH యాజ‌మాన్యం ఇప్ప‌టికీ షాక్‌లో ఉంది -ఇది మాకు ఓ గుణపాఠం.. VVS Laxman | Oneindia Telugu

ముంబై: అన్ని ముందుస్తు జాగ్ర‌త్త‌లు తీసుకున్నా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాకు కరోనా వైరస్ ఎలా సోకిందో అర్థం కావ‌డం లేదని ఆ టీమ్ మెంటార్, భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నాడు. స‌న్‌రైజ‌ర్స్ టీమ్ యాజ‌మాన్యం కూడా ఇప్ప‌టికీ అదే షాక్‌లో ఉన్న‌ద‌ని వెల్ల‌డించాడు. ఇంత క‌ఠిన‌మైన బ‌బుల్‌ను కూడా ఛేదించి వ‌చ్చిందంటే క‌రోనాపై పోరులో ఇది తమకు ఓ గుణపాఠం లాంటిద‌ని హైదరాబాద్ సొగసరి అభిప్రాయ‌ప‌డ్డాడు. పలు జట్లలో కరోనా కేసులు రావడంతో ఐపీఎల్ 2021ని బీసీసీఐ మంగళవారం నిరవధిక వాయిదా వేసిన విషయం తెలిసిందే.

సురేశ్‌ రైనాకు సోనూ సూద్ సాయం.. కేవలం 10 నిమిషాల్లోనే!!సురేశ్‌ రైనాకు సోనూ సూద్ సాయం.. కేవలం 10 నిమిషాల్లోనే!!

 సాహాకు పాజిటివ్‌:

సాహాకు పాజిటివ్‌:

ఐపీఎల్ 2021 ఆరంభ మ్యాచ్‌లు ఆడిన వృద్ధిమాన్ సాహా.. ఆ తర్వాత పూర్తిగా రిజర్వ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. డేవిడ్ వార్నర్‌తో కలిసి ఓపెనింగ్ చేసిన అతడు పూర్తిగా నిరాశపరిచాడు. వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించడంతో ఆదివారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డేవ్ స్థానంలో సాహాని ఓపెనర్‌గా ఆడించాలని సన్‌రైజర్స్ టీమ్ మేనేజ్‌మెంట్ యోచించింది. అయితే సాహా ఆరోగ్యం బాగాలేకపోవడంతో అతని స్థానంలో మనీశ్ పాండేని ఓపెనర్‌గా ఆడించారు. మరుసటి రోజే సాహాకి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది.

అప్పుడే సందేహాలు వ్య‌క్త‌మ‌య్యాయి:

అప్పుడే సందేహాలు వ్య‌క్త‌మ‌య్యాయి:

తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక‌కు రాసిన త‌న కాల‌మ్‌లో వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్ ఇలా పేర్కొన్నాడు. 'ఇంత క‌ఠిన‌మైన బ‌బుల్‌ను కూడా ఛేదించి వ‌చ్చిందంటే.. క‌రోనాపై పోరులో ఇది మాకు ఓ గుణపాఠం లాంటిది. ఒక సిటీ నుంచి మ‌రో సిటీ వెళ్తున్న‌ప్పుడు కూడా ఐపీఎల్ ప్రొటోకాల్స్ ప‌ట్ల మాకు పూర్తి విశ్వాసం ఉండేది. కానీ కోల్‌కతా, చెన్నై క్యాంప్‌ల‌లో పాజిటివ్ కేసులు వ‌చ్చాయ‌ని తెలియ‌గానే మాలో సందేహాలు వ్య‌క్త‌మ‌య్యాయి. ఎందుకంటే.. అంత‌కుముందే మేము వాళ్ల‌తో మ్యాచ్ ఆడాం. ఆ సమయంలో కొంద‌రితో స‌న్నిహితంగా ఉన్నాం. దీంతో మాలోనూ ఆందోళ‌న క‌నిపించింది' అని ల‌క్ష్మ‌ణ్ తెలిపాడు.

సాహాకు క‌రోనా ఎలా వ‌చ్చిందో:

సాహాకు క‌రోనా ఎలా వ‌చ్చిందో:

'వెంటనే జరిపిన కరోనా టెస్టుల్లో నెగ‌టివ్‌గా తేల‌డంతో ఊపిరి పీల్చుకున్నాం. త‌ర్వాత రెండు రోజుల‌కే వృద్ధిమాన్ సాహా పాజిటివ్‌గా తేలాడు. గ‌త బుధ‌వారం సాహా చెన్నైతో మ్యాచ్ ఆడాడు. సాహా ఆదివారం రాజ‌స్థాన్‌తో మ్యాచ్ ఆడాల్సి ఉండింది. అయితే అంత‌కుముందే అత‌డు కాస్త అనారోగ్యంగా ఉన్న‌ట్లు చెప్పాడు. దీంతో అత‌న్ని ఐసోలేష‌న్‌లో ఉంచాం. కానీ అనుకోకుండా అత‌నికి క‌రోనా సోకిన‌ట్లు తేలింది. టోర్నీ సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. సాహా వైరస్ బారినపడటం మమ్మల్ని ఆశ్చర్యపరిచింది. సాహా త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా' అని వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్ కోరుకున్నాడు.

ఒక మ్యాచ్‌లో విజయం:

ఒక మ్యాచ్‌లో విజయం:

ఐపీఎల్ 2021 సీజన్‌లో ఏడు మ్యాచ్‌లాడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కేవలం ఒక మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. రెండు పాయింట్లతో పట్టికలో చిట్టచివరి స్థానంలో ఉంది. అటు బ్యాట్స్‌మెన్‌గా ఇటు సారథిగా విఫలమయిన కెప్టెన్‌ డేవిడ్ వార్నర్‌పై సన్‌రైజర్స్ యాజమాన్యం వేటు వేసింది. న్యూజీలాండ్ ఆటగాడు కేన్‌ విలియమ్సన్‌ను సారథిగా ప్రకటించింది. ఇక వాయిదా పడిన ఐపీఎల్‌ 2021ను మళ్లీ ఎప్పుడు నిర్వహించాలన్న చర్చ మొదలైంది. సీజన్‌ మలిదశ పూర్తి చేసేందుకు సరైన సమయం, వేదిక గురించి బీసీసీఐ, ఐపీఎల్‌ పాలక మండలి మల్లగుల్లాలు పడుతున్నట్టు సమాచారం. ఇతర దేశాల క్రికెట్‌ షెడ్యూళ్లను అనుసరించి సెప్టెంబర్లో రెండో దశను నిర్వహిస్తే బాగుంటుందని బోర్డు పెద్దలు భావిస్తున్నారట.

Story first published: Thursday, May 6, 2021, 20:42 [IST]
Other articles published on May 6, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X