
పరుగులు చేయాలనే ఆతృత..
ఈ క్రమంలోనే వీరి బ్యాటింగ్ గురించి మాట్లాడిన వీవీఎస్ లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'పుజారా, రహానే బ్యాటింగ్‌లో టెక్నికల్ ప్రాబ్లమ్స్, త్వరగా పరుగులు చేయాలన్న ఆత్రుత కనిపిస్తున్నాయి. నాటింగ్‌హామ్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోనూ వారు బద్దకంగా కనిపించారు. మొత్తానికి జింక్స్ రనౌట్ అయ్యాడు. రెండో టెస్టులోనూ అతడి ఫుట్ వర్క్ గందరగోళంగా ఉంది. బంతిపై ఏకాగ్రతకు బదులు నిర్ణయం తీసుకోవడంలో తడబాటు కనిపిస్తుంది. ఫలితం గురించి ఆలోచించినప్పుడు, ఆందోళనకు గురైనప్పుడే ఇలాగే జరుగుతుంది.

ఒత్తిడిని అధిగమించలేక..
'వారిద్దరూ ఒకే తప్పును పదేపదే చేస్తూ నిరాశ పరుస్తున్నారు. అందుకే గత 8-10 నెలలుగా పరుగులు చేయకుండానే ఔటవుతున్నారు. ఆస్ట్రేలియాలోనూ రహానే ఇలాగే పెవిలియన్ చేరాడు. వీడియోలను మరోసారి పరిశీలిస్తే.. రహానే బంతిని ఆలస్యంగా ఆడినట్టు కనిపిస్తోంది. అతడి ఎడమపాదం ఇంకా గాల్లోనే ఉంది. శరీర బరువు షాటుకు తగ్గట్టు బదిలీ అవ్వలేదు. వీరిద్దరిపై బయట నుంచి వచ్చే విమర్శలు ఇబ్బంది పెడుతున్నట్టు కనిపిస్తోంది. కుర్రాళ్లు దూసుకొస్తున్నారు. ఇప్పటికే నిరూపించుకున్న సీనియర్లపై అంచనాల ఒత్తిడి ఉంటుంది. తక్కువ పరుగులు చేసినప్పుడు అది మరింత పెరుగుతుంది' అని లక్ష్మణ్ చెప్పుకొచ్చాడు.

జోరూట్ జోరు..
276/3తో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 364 పరుగుల వద్ద ఆలౌటైంది. తన ఓవర్‌నైట్ స్కోరుకు మరో 2 పరుగులే జోడించిన కేఎల్ రాహుల్ (250 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్‌తో 129 ) టీమ్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 86 పరుగుల వ్యవధిలో భారత్ తమ చివరి 7 వికెట్లు కోల్పోయింది. ఇంగ్లండ్ బౌలర్లలో అండర్సన్ 5 వికెట్లతో చెలరేగడం విశేషం. అనంతరం ఇంగ్లండ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. ఇదే స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ నిలకడగా ఆడుతోంది. కెప్టెన్ జోరూట్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. బెయిర్ స్టో అతనికి అండగా రాణిస్తున్నాడు.