మహ్మద్ సిరాజ్ పేరు అంతర్జాతీయ క్రికెట్లో మార్మోగుతుంది: లక్ష్మణ్

హైదరాబాద్: టీమిండియా పేసర్, హైదరాబాద్ గల్లీ బాయ్ మహ్మద్ సిరాజ్ పేరు అంతర్జాతీయ క్రికెట్లో మార్మోగుతుందని భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నారు. అంతర్జాతీయ క్రికెట్లో ఎదిగే సత్తా సిరాజ్‌కు ఉందని, ఫాస్ట్ బౌలర్లకు ఉండాల్సిన రెండు ప్రధాన లక్షణాలు అతడికీ ఉన్నాయని పేర్కొన్నారు. సీనియర్ పేసర్లు ఉండడంతో న్యూజిలాండ్‌తో జరిగే ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌లో సిరాజ్‌కు చోటు దొరుకుతుందో లేదో అన్న అనుమానం లక్ష్మణ్ వ్యక్తం చేశారు. సౌథాంప్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జూన్ 18 నుంచి 23 వరకూ ఛాంపియన్‌షిప్ జరగనుంది.

సిరాజ్ పేరు మార్మోగుతుంది:
తాజాగా వీవీఎస్ లక్ష్మణ్ సియాసాట్ డాట్ కామ్‌తో మాట్లాడుతూ... 'మహ్మద్ సిరాజ్ మరికొన్నేళ్లు ఇలాగే కష్టపడితే.. అంతర్జాతీయ క్రికెట్లో అతడి పేరు కచ్చితంగా మార్మోగుతుంది. అతడికి అన్ని నైపుణ్యాలు ఉన్నాయి. ఎంతో సత్తా ఉంది. ప్రతి ఫాస్ట్ బౌలరుకు రెండు లక్షణాలు ఉండాలి. మొదట బంతిని అద్భుతంగా స్వింగ్ చేయాలి. సిరాజ్ అందులో నేర్పరి. సుదీర్ఘంగా బౌలింగ్ చేయడం రెండోది. అతడిలో ఈ సత్తా కూడా ఉంది. ఒక రోజులో మూడో స్పెల్ సైతం సిరాజ్ వేయగలడు. అంతేకాదు మొదటి రెండు స్పెల్స్‌లోని వేగం, కచ్చితత్వాన్ని కూడా కొనసాగించగలడు' అని అన్నారు.

మరింత రాటుదేలుతాడు:
'ప్రస్తతం టీమిండియా మంచి ఫాస్ట్ బౌలర్లను కలిగి ఉండటం మన అదృష్టం. మహ్మద్ సిరాజ్‌ను కెప్టెన్ విరాట్ కోహ్లీ లాంగర్ స్పెల్స్ కోసం ఉపయోగించాలని కోరుతున్నా. సిరాజ్ రోజులు గడిచేకొద్దీ మెరుగుపడుతాడని నేను భావిస్తున్నా. ఆస్ట్రేలియాలో ఎలా ఆడాడో మనం చూశాం. పేస్ దాడిలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించాడు. అతను అనుభవంతో మరింత రాటుదేలుతాడు. అయితే సిరాజ్ గాయాలపాలవ్వకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఫాస్ట్ బౌలర్లు తరచూ గాయపడుతారు. కాబట్టి దీనిపై సిరాజ్ దృష్టి పెట్టవలసిన అవసరం ఎంతో ఉంది. గాయాల బారిన పడకుంటేనే అతడు సుదీర్ఘ కాలం జట్టుకు ఆడగలడు' అని లక్ష్మణ్ పేర్కొన్నారు.

చోటు దొరుకుతుందో లేదో:
మొహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్ అందుబాటులో ఉండటంతో ఐసీసీ ప్రపంచ టెస్టు ఫైనల్స్‌లో మహ్మద్ సిరాజ్‌కు చోటు దొరుకుతుందో లేదోనన్న ఆసక్తి నెలకొందని క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ చెబుతున్నారు. సిరాజ్ అంతర్జాతీయ క్రికెట్లో వేగంగా ఎదుగుతున్న సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా పర్యటనలో సీనియర్ పేసర్లు లేకున్నా.. జట్టుకు అండగా నిలిచాడు. మూడు మ్యాచ్‌ల్లో ఏకంగా 13 వికెట్లు తీశాడు. ఇక ఐపీఎల్ 2021లో అదరగొట్టాడు. కచ్చితత్వంతో యార్కర్లు వేసి ఆశ్చర్యపరిచాడు. ఏడు మ్యాచుల్లో ఆరు వికెట్లు పడగొట్టాడు.

ఇంగ్లండ్ పర్యటనకు సిరాజ్:
ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్, ఐదు టెస్ట్‌ల సిరీస్ కోసం విరాట్ కోహ్లీ నేతృత్వంలోని జంబో జట్టు జూన్ 2న ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఇందుకోసం 24 మందితో కూడిన జట్టును బీసీసీఐ కొన్ని రోజుల కింద ప్రకటించిన విషయం తెలిసిందే. మహ్మద్ సిరాజ్ ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికయ్యాడు. జూన్ 18-22 మధ్య న్యూజిలాండ్‌తో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్ ముగిసాక.. భారత్ అక్కడే ఉండి కొన్ని వార్మప్ మ్యాచ్‌లు ఆడనుంది. ఆగస్టులో ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సిరీస్‌లో కోహ్లీసేన తలపడనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications