
మన దగ్గరా ఉన్నారు
టీమిండియా ఓటమి తర్వాత జట్టులో బౌలింగ్, బ్యాటింగ్ ఆప్షన్స్ తక్కువగా ఉన్న అంశాన్ని విమర్శకులు లేవనెత్తారు. అయితే తమ దగ్గర బౌలింగ్ చేయగలిగే బ్యాటర్లు, బ్యాటింగ్ చేయగలిగే బౌలర్లు ఉన్నారని లక్ష్మణ్ అన్నాడు. ఇలాంటి మల్టీ డైమెన్షన్ ఆటగాళ్ల వల్ల మరింత ధైర్యంగా, స్వేచ్ఛతో ఆడే అవకాశం వస్తుందన్నాడు. ఇదే టీ20 ఫార్మాట్ భవిష్యత్తు అని చెప్పిన లక్ష్మణ్.. మిగతా జట్లు కూడా ఇలాంటి మల్టీ డైమెన్షన్ ప్లేయర్లను ఎంపిక చేసే పనిలో పడతాయని అభిప్రాయపడ్డాడు.

కుర్రాళ్ల బలం అదే..
తను ఇప్పటి వరకు చూసిన దానిలో టీమిండియా కుర్రాళ్లలో చాలా మంది మల్టీ డైమెన్షనల్ ఆటగాళ్లేనని లక్ష్మణ్ చెప్పాడు. ఈ కుర్రాళ్లంతా చాలా వేగంగా ఎదుగుతున్నారని, అలాంటి స్వేచ్ఛతో ఆడుతూనే పరిస్థితులకు తగ్గట్లు ఆడటం కూడా ముఖ్యమని వివరించాడు. పొట్టి ఫార్మాట్‌లో టీ20 స్పెషలిస్టుల అవసరాన్ని గుర్తించిన బీసీసీఐ.. న్యూజిల్యాండ్ సిరీస్‌తో ఈ ఫార్మాట్‌లో భారత జట్టులో భారీ మార్పులు చేయాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది.

ఇంగ్లండ్ బెంచ్‌మార్క్
ఒకవిధంగా వైట్ బాల్ క్రికెట్‌లో ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టు ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటీవల టీ20 ప్రపంచకప్ ట్రోఫీ నెగ్గిన ఆ జట్టు.. ఫైనల్‌లో పాకిస్తాన్‌తో ఆడినప్పుడు చివరి ఆటగాడి వరకూ అంతా బ్యాటింగ్ చేయగలిగిన వారే. దానికితోడు ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టులో ఏడుగురు ఆటగాళ్లు బౌలింగ్ చేయగలరు. టీం ప్రధాన బౌలర్ మార్క్ వుడ్ లేకపోయినా ఏడు బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయంటే ఆ జట్టు డెప్త్ అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే మిగతా జట్లు కూడా పొట్టి ఫార్మాట్‌లో ఇలా బ్యాటింగ్‌తోపాటు బౌలింగ్ చేయగలిగే బ్యాటర్లను, అలాగే బౌలింగ్‌తోపాటు బ్యాటింగ్ చేయగలిగే బౌలర్లను ఎంపిక చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి.


Click it and Unblock the Notifications












