

నాటింగ్‌హామ్: ధనార్జన కాదు.. ముఖ్యం. సేవ చేయాలనే మనస్సు ఉంటే ఎక్కడైనా.. ఎంత ఉన్నా చేయగలం. ఇలాగే ఆలోచించాడో సెక్యూరిటీ సిబ్బంది ఎంత పంచినా తరగని అక్షర జ్ఞానాన్ని చిన్నారులకు పంచి తన ఔన్నత్యాన్ని చాటుకున్నాడు. ఓ పెద్దాయన తన సేవాదృక్పథంతో ఓ మంచి పని చేస్తున్నాడు. ఆయన చేసిన దానికి ఏకంగా టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ మనసు గెలుచుకున్నాడు.
అతడు చేసిన గొప్ప పనిని లక్ష్మణ్ ట్వీట్‌తో ప్రపంచానికి తెలియజేశాడు. నెటిజన్ల కూడా ఆ పెద్దాయనను రియల్ హీరో అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అసలు కథేంటంటే.. డెహ్రాడూన్‌కు చెందిన బ్రిజేంద్ర గతంలో ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యాడు. తర్వాత ఓ ఏటీఎం దగ్గర సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. రోజూ సాయంత్ర తన విధులు నిర్వహిస్తూనే.. చుట్టు పక్కల మురికివాడల్లో ఉండే పిల్లలకు చదువు చెబుతున్నాడు.
ఏటీఎం దగ్గర ఉండే లైట్ల వెలుగులోనే విద్యా బుద్ధులు నేర్పుతున్నాడు. రోజూ ఓ ఐదారుగురు పిల్లలు అక్కడికి వస్తున్నారు. ఆర్మీ నుంచి తాను రిటైర్ అయినా.. జాతిపై ప్రేమ ఏ మాత్రం దాచుకోవట్లేదు. బిజేంద్ర గురించి ట్వీట్ చేసిన లక్ష్మణ్.. ఆర్మీ సైనికుడంటే దేశ సరిహద్దుల్లోనే కాదు. ఎక్కడైనా ఉంటారు. సెల్యూట్ సార్. .. రియల్ హీరో బ్రిజేంద్ర.. ఏటీఎం దగ్గర సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నాడు.
ఆర్మీ నుంచి రిటైర్ అయినా.. ఇప్పటికీ దేశం కోసం తన సేవలు అందజేస్తున్నాడు. మురికివాడల్లో పిల్లలకు ఏటీఎం లైట్ల కిందే.. రోజూ రాత్రి వరకు చదువు చెబుతున్నాడు. అలాంటి గొప్ప వ్యక్తికి సెల్యూట్ అన్నాడు. లక్ష్మణ్ ట్వీట్‌పై నెటిజన్లు కూడా స్పందించారు. బ్రిజేంద్ర చేస్తున్న పనిని కొనియాడుతున్నారు. అతని గొప్పదనాన్ని పొగిడేందుకు మాటల్లేవ్... గొప్ప పని చేస్తున్నారు. ఇలానే కొనసాగించండి.. ఇప్పుడు మరో సారి వైరల్ అయింది. కానీ, ఇతను 2016 నుంచే ఇలా విద్యాబుద్ధులు నేర్పుతున్నారు.