న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ఈడెన్‌లో లక్ష్మణ్ 281 ఇన్నింగ్స్ నా కెరీర్‌ను కాపాడింది'

VVS Laxmans 281 At Eden Gardens Saved My Career, Says Sourav Ganguly

హైదరాబాద్: ఈడెన్ గార్డెన్స్‌లో వీవీఎస్ లక్ష్మణ్ ఆడిన 281 పరుగుల ఇన్నింగ్స్ తన కెరీర్‌ను కాపాడిందని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ చెప్పాడు. ఈడెన్ గార్డెన్స్‌లో ఆస్ట్రేలియాపై సాధించిన విజయం భారత క్రికెట్‌ను సరికొత్త దిశగా తీసుకెళ్లిందని చెప్పాడు.

హాకీ వరల్డ్‌కప్: సెమీస్ పోరులో నెదర్లాండ్స్‌పై భారత్ గెలిచేనా .. !! హాకీ వరల్డ్‌కప్: సెమీస్ పోరులో నెదర్లాండ్స్‌పై భారత్ గెలిచేనా .. !!

వీవీఎస్ లక్ష్మణ్ ఆటోబయోగ్రఫీ 281 అండ్ బియాండ్ పుస్తకాన్ని బుధవారం కోల్‌కతాలో విడుదల చేసిన సందర్భంగా గంగూలీ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఈ సందర్భంగా గంగూలీ మాట్లాడుతూ "లక్ష్మణ్ ఆత్మకథ పేరు నాకు నచ్చలేదు. ఆ ఇన్నింగ్స్ గొప్పతనాన్ని చాలా తేలికగా చూపెట్టారు" అని అన్నాడు.

పేరు బాగాలేదని టెక్ట్స్ మెసేజ్ పెట్టా

పేరు బాగాలేదని టెక్ట్స్ మెసేజ్ పెట్టా

"పేరు బాగాలేదని నెల కిందట టెక్ట్స్ మెసేజ్ పెట్టా. కానీ నాకు సమాధానం చెప్పలేదు. 281 అండ్ బియాండ్, సేవ్‌డ్ గంగూలీ కెరీర్ అని పెడితే బాగుండేది. అప్పుడు సరిగ్గా సరిపోయేది. ఎందుకంటే అప్పట్లో లక్ష్మణ్ ఆ ఇన్నింగ్స్ ఆడకపోతే మ్యాచ్ ఓడిపోయేవాళ్లం" అని గంగూలీ ఆ ఇన్నింగ్స్‌ను గుర్తు చేసుకున్నాడు.

 నా కెప్టెన్సీ కూడా పోయేది

నా కెప్టెన్సీ కూడా పోయేది

ఈ కార్యక్రమంలో సౌరవ్ గంగూలీతో పాటు టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ కూడా హాజరయ్యాడు. దీంతో పాటు తన కెప్టెన్సీ కూడా పోయేది అని గంగూలీ పేర్కొన్నాడు. లక్ష్మణ్ ఆటోబయోగ్రఫీ పుస్తకాన్ని వెస్ట్‌ల్యాండ్ పబ్లికేషన్స్ సంస్థ పబ్లిష్ చేసింది. అంతేకాదు వెస్ట్‌ల్యాండ్ స్పోర్ట్ ద్వారా ఈ పుస్తకాన్ని విడుదల చేశారు.

ఆర్ కౌషిక్ సహ రచయితగా లక్ష్మణ్ ఆటో బయోగ్రఫీ

ఆర్ కౌషిక్ సహ రచయితగా లక్ష్మణ్ ఆటో బయోగ్రఫీ

ప్రఖ్యాత స్పోర్ట్ జర్నలిస్ట్ ఆర్ కౌషిక్ సహ రచయితగా ఈ పుస్తకాన్ని రచించిన సంగతి తెలిసిందే. టెస్టు క్రికెట్‌లో లక్ష్మణ్ అద్భుత ప్రదర్శన చేసినా.. వన్డేల్లో మాత్రం అనుకున్న స్థాయిలో రాణించలేకపోయాడు. ఫలితంగా 2003 దక్షిణాఫ్రికాలో జరిగిన వరల్డ్ కప్‌కు లక్ష్మణ్‌ను ఎంపిక చేయలేదు.

 ఇది ఘోరమైన తప్పిదమే

ఇది ఘోరమైన తప్పిదమే

దీనిపై స్పందించిన గంగూలీ "ఇది ఘోరమైన తప్పిదమే. ఎందుకంటే వీవీఎస్ అన్ని ఫార్మాట్లలో బాగానే ఆడాడు. కానీ ఓ కెప్టెన్‌గా కొన్నిసార్లు తీసుకున్న నిర్ణయం సరైందో కాదో తెలియదు. దాని ప్రభావం తర్వాత తెలుస్తుంది. అప్పటికిగానీ వాస్తవిక దృక్పథంలోకి రాలేం" అని చెప్పుకొచ్చాడు.

Story first published: Thursday, December 13, 2018, 10:54 [IST]
Other articles published on Dec 13, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X