న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఈడెన్‌లో లక్ష్మణ్‌ చేసిన 281 ఇన్నింగ్స్‌ అత్యుత్తమ ఇన్నింగ్స్: ద్రవిడ్

VVS Laxmans 281 at Eden Gardens is the greatest innings played by an Indian cricketer, says Rahul Dravid

హైదరాబాద్: ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆస్ట్రేలియా జట్టుపై వీవీఎస్‌ లక్ష్మణ్‌ సాధించిన 281 పరుగులు ఓ భారత క్రికెటర్‌ ఆడిన అత్యుత్తమ, అద్భుత ఇన్నింగ్స్‌ అని క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ అన్నాడు. బెంగళూరు వేదికగా లక్ష్మణ్‌ ఆటో బయోగ్రఫీ '281 అండ్‌ బియాండ్‌' పుస్తక ఆవిష్కరణ వేడుక కార్యక్రమంలో ద్రవిడ్ మాట్లాడాడు.

వేలంలో అమ్ముడుపోలేదు: రిటైర్మెంట్ యోచనలో బ్రెండన్ మెక్‌కల్లమ్వేలంలో అమ్ముడుపోలేదు: రిటైర్మెంట్ యోచనలో బ్రెండన్ మెక్‌కల్లమ్

"అవును, ఎలాంటి అనుమానం లేదు. అప్పటి పరిస్థితులు, పోటీ చూస్తే 281 పరుగుల ఇన్నింగ్స్‌ ఓ భారత క్రికెటర్‌ ఆడిన అత్యుత్తమ, అద్భుతమైన ఇన్నింగ్స్‌. నేనిప్పటికీ లక్ష్మణ్ ఆటను ఊహించుకుంటా. లెంగ్‌ స్టంప్‌ ఆవలకు వచ్చి షేన్‌వార్న్‌ వేసిన బంతిని కవర్స్‌లోకి పంపించడం, టర్న్ అవుతున్న ఈడెన్‌ పిచ్‌పై ఆఫ్‌స్టంప్‌, మిడిల్‌ స్టంప్‌ మీదుగా ఫ్లిక్‌ చేయడం ఎంతో గొప్ప" అని ద్రవిడ్‌ అన్నాడు.

లక్ష్మణ్‌ బ్యాటింగ్‌ను‌ ప్రత్యక్షంగా వీక్షించడం

"మెక్‌గ్రాత్‌, జాసన్ గిలెస్పీ బంతుల్ని డ్రైవ్‌ చేయడం అద్భుతం. లక్ష్మణ్‌ బ్యాటింగ్‌ను‌ ప్రత్యక్షంగా వీక్షించడం అపురూప అనుభవం. లక్ష్మణ్‌ బ్యాటింగ్‌ను వీక్షించడం నమ్మశక్యంగా అనిపించదు. అతిగా క్రికెట్‌ వీక్షించడం నాకు ఇష్టం ఉండదు. టీవీలో పాత మ్యాచులు వస్తే నా బ్యాటింగ్‌ చూడాలనిపించదు. అందులో నేను ఆడుతుంటే వెంటనే ఛానెల్‌ మార్చేస్తా" అని ద్రవిడ్ చెప్పుకొచ్చాడు.

లక్ష్మణ్‌‌ 90 పరుగుల వద్ద ఉండగా

"నిజం చెప్పాలంటే నేనప్పుడు మంచి ఫామ్‌లో లేను. లక్ష్మణ్‌‌ 90 పరుగుల వద్ద ఉండగా ఆరోస్థానంలో బ్యాటింగ్‌కు వచ్చా. ఆ సిరీస్‌లో నేను బాగా ఆడలేదు. లక్ష్మణ్ బ్యాటింగ్‌ను చూశాక నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఆరోజు ఏదో మాయ జరిగింది. కుర్రాడిగా వీవీఎస్‌ లక్ష్మణ్‌ ఆటను ఆస్వాదించి అతడితో కలిసి ఆడటం మరిచిపోలేని అనుభూతి" అని ద్రవిడ్ పేర్కొన్నాడు.

ఈడెన్ పిచ్‌పై ఆడటం భయంగా అనిపించింది

ఈడెన్ పిచ్‌పై ఆడటం భయంగా అనిపించింది

"నిజానికి పిచ్‌పై ఆడటం భయంగా అనిపించింది. మేం భవిష్యత్ గురించే ఆలోచించాం. ఫాలోఆన్‌ తర్వాత భారత్‌ 274 పరుగులు వెనకబడి ఉంది. బంతిని సమర్ధవంతంగా ఎదుర్కొన్నాం. ఆడుతున్న సమయంలో ఇద్దరం ఎక్కువగా మాట్లాడుకోలేదు. గ్లౌజులతో పంచ్‌లు ఇచ్చుకుంటూ మరొక్క ఓవర్‌ అని చెప్పుకున్నాం" అని రాహుల్ ద్రవిడ్ తెలిపాడు.

లక్ష్మణ్‌‌తో మాట్లాడాలని వస్తే

లక్ష్మణ్‌‌తో మాట్లాడాలని వస్తే

"లక్ష్మణ్‌‌తో మాట్లాడాలని వస్తే అతడు ఏమో అదేపనిగా క్రీజు వద్ద గీతలు మార్కింగ్‌ చేసేవాడు. గ్లౌజులు తీసి వేసుకోవడం, బ్యాటింగ్‌ క్రీజుకు ఇటు వైపు ఏడు సార్లు, అటువైపు ఆరుసార్లు మార్కింగ్‌ చేసేవాడు. అందుకే మాట్లాడేందుకు సమయం ఉండేది కాదు. ఎప్పుడొచ్చినా అలాగే చేసేవాడు. అతడి కాళ్లు లాగేయాలని అనుకునేవాడిని" అని ద్రవిడ్‌ అప్పటి సంగతులను గుర్తు చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో వీవీఎస్‌ లక్ష్మణ్‌‌తో రాహుల్ ద్రవిడ్(180) కూడా అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు.

Story first published: Friday, December 21, 2018, 20:38 [IST]
Other articles published on Dec 21, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X