రోహిత్ కెప్టెన్సీపై ప్రశంసలు కురిపిస్తోన్న లక్ష్మణ్

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్‌గా అద్భుతమైన బ్యాటింగ్ శైలి ప్రదర్శిస్తున్న విరాట్ కోహ్లీ.. కెప్టెన్‌గా అందరి మన్ననలు పొందలేకపోయాడు. విమర్శలు ఎదుర్కొంటూనే జట్టును నడిపిస్తున్న కోహ్లీ.. వరుస మ్యాచ్‌లతో అలసిపోయి విరామం నిమిత్తం కొన్ని సిరీస్‌లకు దూరమైయ్యాడు. కోహ్లీ లేకపోవడంతో జట్టు తాత్కాలిక కెప్టెన్సీ బాధ్యతలను రోహిత్ శర్మ భుజాలకేసుకున్నాడు.

దాదాపు అన్నీ సిరీస్‌లను విజయవంతంగా
ఈ క్రమంలో రోహిత్ కెప్టెన్సీ వహించిన దాదాపు అన్నీ సిరీస్‌లను విజయవంతంగా ముగించడంతో రోహిత్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. అంతేకాకుండా కెప్టెన్సీ వహిస్తున్నప్పటి నుంచి అతని బ్యాటింగ్ శైలిలోనూ మార్పు కనిపిస్తుండటంతో రోహిత్ అద్భుతమైన రికార్డులు సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే భారత మాజీ బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్ తాత్కాలిక కెప్టెన్ రోహిత్‌ను చూసి ఇంప్రెస్ అయ్యానని చెప్పుకొచ్చాడు.

మ్యాచ్ నడిపించడంలో హుందాగా
'నేను మళ్లీ రోహిత్ కెప్టెన్సీ చూసి సంతృప్తి చెందాను. అతను మ్యాచ్‌ను నడిపించడంలో హుందాగా వ్యవహరిస్తున్నాడు. ప్రత్యేకంగా టీ20 ఫార్మాట్‌లో అతని ప్రదర్శన చాలా బాగుంటుంది. మైదానంలో ఉన్నంతసేపు స్పష్టమైన వ్యూహంతో ఉంటాడు. ఒకవేళ అందులో లోపాలుంటే వాటిని సరిదిద్దుకోవడానికి కూడా ఏ మాత్రం సంకోచించడు.

ధోనీతో పాటుగా రోహిత్ మూడు టైటిళ్లను
ఐపీఎల్‌లో కెప్టెన్సీ వహించిన విధంగానే అంతర్జాతీయ టీ20ల్లోనూ చక్కటి కెప్టెన్సీ వహిస్తున్నాడు. ధోనీతో పాటుగా రోహిత్ మూడు టైటిళ్లను గెలిచాడు. ఐపీఎల్ 2013లో రోహిత్ కెప్టెన్సీ వహించిన తీరు... చెన్నై ఐపీఎల్ అరంగ్రేట మ్యాచ్‌లో ధోనీ కెప్టెన్సీకి దగ్గరి పోలిక ఉంది.

12సిరీస్‌లు ఆడి పదకొండింటిలో విజేతగా
ఇదిలా ఉంచితే వెస్టిండీస్‌తో ఆడిన అంతర్జాతీయ టీ20లో రోహిత్ 12సిరీస్‌లు ఆడి పదకొండింటిలో విజేతగా నిలిచాడు. ఇందులో రెండు సిరీస్‌లలో 3-0తో క్లీన్ స్వీప్‌గా ముగించాడు. ధోనీ, కోహ్లీ ఇద్దరిలో మహీ ఒక్కడే ఆస్ట్రేలియాపై 2016లో 3-0తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications