Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'టీ20ల నుంచి ధోని తప్పుకునే సమయం ఆసన్నమైంది'

హైదరాబాద్: టీ20 ఫార్మాట్ నుంచి టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తప్పుకునే సమయం ఆసన్నమైందని మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నాడు. టీ20 ఫార్మాట్ నుంచి ధోని తప్పుకుని యువ క్రికెటర్లకు ఆడేందుకు అవకాశం ఇవ్వాలని లక్ష్మణ్ సూచించాడు.

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో వన్డే ఫార్మాట్‌కు మాత్రమే పరిమితమై టీ20ల నుంచి ధోని తప్పుకుంటే బాగుంటుందని లక్ష్మణ్ పేర్కొన్నాడు. 'టీ20ల్లో ధోని నాలుగో స్ధానంలో బ్యాటింగ్‌కు వస్తున్నాడు. ఈ స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చేటప్పుడు క్రీజులో కుదురుకోవడానికి ఎక్కువ సమయం తీసుకునే ఆస్కారం ఉండదు' అని లక్ష్మణ్ అన్నాడు.

VVS Laxman makes this big statement on MS Dhoni’s T20I career

'ధోని ఇక్కడ ఎక్కువ సమయం తీసుకున్న తర్వాత గానీ బ్యాట్ ఝళిపించడం లేదు. న్యూజిలాండ్‌తో శనివారం నాటి మ్యాచ్‌నే చూడండి. ఒకవైపు విరాట్ కోహ్లీ దూకుడుగా బ్యాటింగ్ కొనసాగిస్తే, ధోని మాత్రం స్ట్రయిక్ రొటేట్ చేయడానికి ఇబ్బంది పడ్డాడు' అని లక్ష్మణ్ చెప్పుకొచ్చాడు.

'ఛేదనలో కోహ్లి స్ట్రైక్‌రేట్‌ 160కాగా.. ధోనీది 80 మాత్రమే. అంత భారీ లక్ష్యాన్ని ఛేదించేటప్పుడు ఈ స్ట్రైక్‌రేట్‌ ఏమాత్రం సరిపోదు. టీమిండియా భారీ లక్ష్యాన్ని ఛేదించేటప్పుడు ఈ తరహా బ్యాటింగ్ సరిపోదు. టీ20ల్లో ధోని ధోని తప్పుకుని యువకులకు అవకాశం ఇవ్వాలి' అని లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు.

Story first published: Monday, November 13, 2017, 12:18 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+