Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గంభీర్ స్థానంలో టీమిండియాకు కొత్త కోచ్ ఖరారు.. బీసీసీఐ కీలక నిర్ణయం!

మరో పది రోజుల్లో ప్రారంభం కానున్న దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు భారత జట్టు కోచింగ్ బాధ్యతలను వీవీఎస్ లక్ష్మణ్ అందుకోనున్నాడని తెలుస్తోంది. ఎన్సీఏ డైరెక్టర్‌గా ఉన్న లక్ష్మణ్ గతంలో కూడా టీమిండియాకు తాత్కాలిక కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. జింబాబ్వే పర్యటనలో శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని యువ జట్టును కోచ్‌గా నడిపించాడు.

ఆస్ట్రేలియా పర్యటనతో ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ బిజీగా ఉండనున్న నేపథ్యంలో బీసీసీఐ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న అయిదు టెస్టుల సిరీస్ కోసం రోహిత్ సేన నవంబర్ 10న బయలుదేరే అవకాశం ఉంది. మరోవైపు దక్షిణాఫ్రికాలో నవంబర్ 8 నుంచి 13వ తేదీ వరకు సౌతాఫ్రికాతో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని జట్టు నాలుగు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది.

VVS Laxman Likely to Be Appointed India s Head Coach for South Africa Tour

ఈ క్రమంలో సౌతాఫ్రికా సిరీస్‌కు కోచ్‌గా వ్యవహరించడానికి గంభీర్‌కు సాధ్యపడదు. ఈ నేపథ్యంలో లక్ష్మణ్‌కు తాత్కాలిక కోచ్‌గా బీసీసీఐ బాధ్యతలు అప్పగించనుంది. లక్ష్మణ్‌కు సహాయక కోచింగ్ సిబ్బందిగా ఎన్సీఏలో ఇతర కోచ్‌లు, స్టాఫ్ అయిన సాయిరాజ్ బహుతులే, హృషికేష్ కంటికర్, శుభదీప్ ఘోష్ పనిచేయనున్నారు. ఎమర్జింగ్ ఆసియా టీ20 కప్‌కు భారత-ఏ జట్టుకు సాయిరాజ్ బహుతులే ప్రధాన కోచ్‌గా పనిచేశారు.

దక్షిణాఫ్రికాతో నాలుగు టీ20ల షెడ్యూల్
నవంబర్ 08: తొలి టీ20- డర్బన్
నవంబర్ 10: రెండో టీ20- సెయింట్ జార్జ్ పార్క్
నవంబర్ 13: మూడో టీ20- సెంచూరియన్
నవంబర్ 15: నాలుగో టీ20- జొహెన్నెస్‌బర్గ్

సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, రింకూ సింగ్, తిలక్ వర్మ, జితేష్ శర్మ, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రమణదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తీ, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, విజయ్ కుమార్ వైశాఖ్, ఆవేశ్ ఖాన్, యశ్ దయాల్.

ఆస్ట్రేలియాతో అయిదు టెస్టుల సిరీస్ షెడ్యూల్
నవంబర్ 22-26: తొలి టెస్టు- పెర్త్
డిసెంబర్ 06-10: రెండో టెస్టు- అడిలైడ్
డిసెంబర్ 14-18: మూడో టెస్టు- బ్రిస్బేన్
డిసెంబర్ 26-31: నాలుగో టెస్టు- మెల్‌బోర్న్
జనవరి 03-08: అయిదో టెస్టు- సిడ్నీ

Story first published: Monday, October 28, 2024, 11:05 [IST]
Other articles published on Oct 28, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+