Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇండియాను గెలిపించిన వివియస్ లక్ష్మణ్, ఇషాంత్ శర్మ

VVS Laxman
మొహాలీ: అనూహ్యమైన రీతిలో ఆస్ట్రేలియాపై మొహాలిలో జరిగిన తొలి టెస్టు మ్యాచులో భారత్ విజయం సాధించింది. వివియస్ లక్ష్మణ్, ఇషాంత్ శర్మ భారత్ కు విజయాన్ని చేకూర్చి పెట్టారు. ఈ విజయం ఖ్యాతి అంతా వారిద్దరికే దక్కుతుంది. భారత్ కు అపజయం తప్పదని భావించిన తరుణంలో లక్ష్మణ్ కు తోడుగా వచ్చిన ఇషాంత్ శర్మ చక్కటి బ్యాటింగ్ ను ప్రదర్శించాడు. మెచ్యూరిటీనీ, అనుభవాన్నీ జోడించి లక్ష్మణ్ కు సహకారం అందించాడు. అదే భారత విజయానికి బాటలు వేసింది. రెండో ఇన్నింగ్సులో భారత టాప్ ఆర్డర్ ఆస్ట్రేలియా బౌలర్లకు తల వంచింది. అతి సాధారణమైన లక్ష్యాన్ని ఛేదించడంలో భారత బ్యాట్స్ మెన్ చేతులెత్తేశారు. విజయానికి కేవలం 216 పరుగులు చేయాల్సిన భారత్ సోమవారం రెండో ఇన్నింగ్సును ప్రారంభించి 55 పరుగులకే నాలుగు వికెట్లను కోల్పోయి పీకల లోతు కష్టాల్లో పడింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ ను ఒక్క వికెట్ తేడాతో ఆస్ట్రేలియాపై భారత్ గెలుచుకుంది. ఈ విజయం ఘనత లక్ష్మణ్ కే దక్కుతుంది. లక్ష్మణ్ అజేయంగా నిలిచాడు. దీంతో భారత్ ఆస్ట్రేలియాపై టెస్టు సిరీస్ లో 1-0 స్కోరుతో ముందంజలో ఉంది.

సోమవారం సాయంత్రం నైట్ వాచ్ మన్ గా వచ్చిన జహీర్ ఖాన్ మంగళవారం అతి తక్కువ వ్యవధిలోనే అవుటయ్యాడు. ఆ తర్వాత సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ, హర్భజన్ సింగ్ పెవిలియన్ కు దారి కట్టారు. 124 పరుగులకు ఎనిమిది వికెట్లు కోల్పోయిన స్థితిలో ఇషాంత్ శర్మ బ్యాటింగ్ కు దిగాడు. విజయానికి వందకు పైగా పరుగులు చేయాల్సి ఉంది. అది సాధ్యమయ్యే పని కాదనే అందరూ భావించారు. అయితే, ఇషాంత్ శర్మ పట్టుదల, లక్ష్మణ్ అనుభవం ఆ భావనను పటాపంచలు చేసింది. సచిన్ టెండూల్కర్ 38 పరుగులకు, జహీర్ ఖాన్ 10 పరుగులకు, ధోనీ, హర్భజన్ రెండేసి పరుగులకు అవుటయ్యారు. సోమవారం గంభీర్, రైనాలు డకవుట్ కాగా, సెహ్వాగ్ 17, ద్రావిడ్ 13 పరుగులు చేశారు. ఇషాంత్ శర్మ టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరును నమోదు చేసుకున్నాడు. విజయానికి 11 పరుగులు చేయాల్సిన స్థితిలో ఇషాంత్ శర్మ 31 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. చివరి ఒక వికెట్ మిగిలి ఉన్న సమయంలో ప్రజ్ఞాన్ ఓజా బ్యాటింగ్ కు దిగాడు. మ్యాచ్ తీవ్ర ఉత్కంఠగా మారింది.

ఇషాంత్ శర్మ ఎల్ డబ్ల్యు ఇచ్చాడు. అయితే, అది వికెట్లను తాకే స్థితిలో లేదని టీవీ రిప్లేలో తేలింది. లక్ష్మణ్ సింగిల్స్ తీయడం మానేశాడు. లక్ష్మణ్ కు సురేష్ రైనా రన్నర్ గా వ్యవహరించాడు. జాన్సన్ బౌలింగ్ లో అతను రెండు పరుగులు చేశాడు. ఓవర్ చివరి బంతికి ఒక్క పరుగు తీసి స్ట్రయింగ్ తీసుకోవాలని ప్రయత్నించిన లక్ష్మణ్ ను ఆస్ట్రేలియా ఫీల్డర్లు అడ్డుకున్నారు. ఆ సమయంలో విజయానికి భారత్ కు 9 పరుగులు కావాల్సి ఉంది. తర్వాతి ఓవర్ తొలి బంతికి ఓజా ఒక్క పరుగు చేయగా, లక్ష్మణ్ రెండు పరుగులు చేశారు. దీంతో విజయానికి మరో ఆరు పరుగుల దూరంలో భారత్ నిలిచింది. తర్వాతి జాన్సన్ వేసిన బంతిలో ఓవర్ త్రో వల్ల నాలుగు పరుగులు బైస్ గా వచ్చాయి. ఆ తర్వాత జాన్నన్ బౌలింగ్ లో ఓజాకు రెండు పరుగులు బైస్ గా వచ్చాయి. దీంతో భారత్ ఉత్కంఠ భరిత మ్యాచ్ లో విజయం సాధించింది.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+