Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Rishabh Pant: నీకు చాలా రుణపడి ఉంటాం.. పంత్‌ను కాపాడిన డ్రైవర్‌కు మాజీ లెజెండ్ కృతజ్ఞతలు

VVS Laxman calls driver who rescued Rishabh Pant a real hero

ఏడాది ముగుస్తున్న తరుణంలో భారత క్రికెట్ అభిమానులకు భయంకరమైన షాక్ తగిలింది. టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్‌ ఘోరమైన రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. చావు బతుకుల మధ్య ఉన్న అతన్ని డెహ్రాడూన్‌లోని ఒక ఆస్పత్రిలో చేర్పించగా.. అక్కడే చికిత్స పొందుతున్నాడు. కొత్త సంవత్సరం వస్తున్న నేపథ్యంలో తల్లికి సర్‌ప్రైజ్ ఇద్దామని పంత్ వెళ్తుండగా యాక్సిడెంట్ జరిగిందని సమాచారం.

కాపాడిన సుశీల్ కుమార్

కాపాడిన సుశీల్ కుమార్

వేగంగా వెళ్తుండగా అతని కారు డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ సమయంలో కిటికీ అద్దం పగలడంతో దానిలో నుంచి బయట పడేందుకు పంత్ ప్రయత్నించాడు. ఆలోపే వాహనానికి మంటలు అంటుకున్నాయి. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఒక హరియాణా బస్సులో డ్రైవర్ సుశీల్ కుమార్.. తన బస్సును రోడ్డు పక్కన ఆపేసి కిందకు పరిగెత్తుకొచ్చాడు.

కారు కిటికీలో నుంచి సగం బయటకు వచ్చిన పంత్‌ను పూర్తిగా బయటకు లాగి, ఒక బెడ్‌షీట్‌తో అతన్ని కప్పాడు. వెంటనే అంబులెన్సుకు సమాచారం అందించాడు.

తల్లి మొబైల్ స్విచాఫ్

తల్లి మొబైల్ స్విచాఫ్

అలాగే కారులో ఇంకెవరైనా ఉన్నారా? అని చెక్ చేసిన సుశీల్ కుమార్.. ఎవరూ లేకపోవడంతో కారులో ఉన్న కొన్ని వస్తువులు, డబ్బు తీసుకొని వచ్చేశాడు. అంబులెన్సులో ఉండగా పంత్‌కు వాటిని అందించాడు. పంత్ తల్లికి ఫోన్ చేయగా.. మొబైల్ స్విచాఫ్ అని వచ్చినట్లు సుశీల్ తెలిపాడు. ఇలా పంత్‌కు సాయం చేసిన సుశీల్ కుమార్‌కు క్రికెట్ లెజెండ్ వీవీఎస్ లక్ష్మణ్ కృతజ్ఞతలు తెలిపాడు. అతన్ని రియల్ హీరో అని మెచ్చుకున్నాడు. సుశీల్ కుమార్‌కు తాము చాలా రుణపడి ఉంటామని చెప్పాడు. ఈ మేరకు తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశాడు.

మీరు రియల్ హీరో..

'తగలబడుతున్న కారు నుంచి రిషభ్ పంత్‌ను కాపాడి, అతని చుట్టూ బెడ్‌షీట్ చుట్టి, అంబులెన్సుకు సమాచారం ఇచ్చిన హరియాణా రోడ్‌వేస్ డ్రైవర్ సుశీల్ కుమార్‌కు ధన్యవాదాలు. ఇంత గొప్ప సేవ చేసినందుకు మేం మీకు చాలా రుణపడి ఉంటాం. సుశీల్ గారూ మీరు రియల్ హీరో' అని లక్ష్మణ్ ట్వీట్ చేశాడు.

ఈ ఘటన గురించి ఆ తర్వాత మాట్లాడిన సుశీల్.. తను క్రికెట్ చూడనని, రిషభ్ పంత్ ఎవరూ కూడా తనకు తెలియదని చెప్పాడు. అయితే తన బస్సులో ఉన్న కొందరు మాత్రం అతన్ని గుర్తుపట్టారన్నాడు. పంత్ కూడా తను క్రికెటర్ అనే విషయం చెప్పాడని గుర్తుచేసుకున్నాడు.

Story first published: Saturday, December 31, 2022, 8:13 [IST]
Other articles published on Dec 31, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+