Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'ధోని జట్టులోకి తిరిగి రావాలనుకుంటే మళ్లీ ఆడటం ప్రారంభించాలి'

vMS Dhoni should start playing again if he wants to make a comeback: Madan Lal

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని జాతీయ జట్టులోకి తిరిగి రావాలనుకున్నప్పుడు అతడు దేశవాళీ క్రికెట్‌ ఆడితే బాగుంటుందని మాజీ క్రికెటర్ మదన్‌లాల్ అభిప్రాయపడ్డాడు. తాజాగా ఓ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో ధోని పునరాగమనంపై మదన్‌లాల్ స్పందించాడు.

"జాతీయ జట్టులో తిరిగి ఆడాలా వద్దా అనేది ధోని నిర్ణయం. నేరుగా జట్టులో తిరిగి రావడం చాలా కఠినంగా ఉంటుంది. కాబట్టి అతడు దేశవాళీ క్రికెట్ ఆడటం లేదా మరేదైనా ఇతర మ్యాచ్‌లో ఆడటం ప్రారంభించాలి" అని మదన్‌లాల్ పేర్కొన్నాడు. ధోనీ ఆడాలనుకుంటే ఎవరూ ఆపలేరు అని హెడ్ కోచ్‌ రవిశాస్త్రి అన్న సంగతి తెలిసిందే.

ఇంగ్లాండ్ వేదికగా వరల్డ్‌కప్ ముగిసిన తర్వాత తొలుత భారత ఆర్మీకి సేవలందించేందుకు గాను ధోని విండిస్ పర్యటనకు దూరమయ్యాడు. ఆ తర్వాత సొంతగడ్డపై జరిగిన దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టీ20 సిరీస్‌కు కూడా అందుబాటులో లేడు. నవంబర్ 3 నుంచి బంగ్లాతో జరిగే టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో కూడా ధోనీకి చోటు దక్కలేదు.

ప్రస్తుతం వెస్టిండిస్‌తో స్వదేశంలో జరుగుతున్న పరిమిత ఓవర్ల సిరిస్‌కు కూడా ధోని దూరమయ్యాడు. వచ్చే ఏడాది న్యూజిలాండ్‌తో జరిగే సిరిస్‌కు ధోని ఎంపికయ్యే అవకాశాలున్నాయి. చెన్నై వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత ఓటమికి కారణాన్ని కూడా వెల్లడించారు.

తొలి వన్డేలో టీమిండియా బౌలింగ్ దాడి చాలా బలహీనంగా ఉందని, వారు కేవలం ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగడం కూడా భారత ఓటమికి కారణమైందని తెలిపాడు. చెన్నై వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య రెండో వన్డే బుధవారం విశాఖపట్నం వేదికగా జరగనుంది.

Story first published: Monday, December 16, 2019, 18:58 [IST]
Other articles published on Dec 16, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+