Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL2025: తెలుగు క్రికెట్ ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే న్యూస్.. ఇకపై హైదరాబాద్‌తో పాటు అక్కడ కూడా!

ఐపీఎల్ 2025 కొత్త సీజన్‌కు సమయం ఆసన్నమైంది. పది జట్లు హోరాహోరీగా తలపడే ఈ మెగా లీగ్‌ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ మెగా లీగ్ కు సంబంధించిన పూర్తి షెడ్యూల్ కూడా ప్రకటించేశారు. ఈ నేపథ్యంలో తెలుగు ప్రేక్షకులను ఉత్సాహపరిచేలా ఓ అదిరిపోయే వార్త బయటకు వచ్చింది.

ఇప్పటికే ఈ మెగా లీగ్ ఐపీఎల్ 2025 సీజన్ ను హైదరాబాద్‌ ఆతిథ్యం ఇస్తోన్న సంగతి తెలిసిందే. అయితే గతేడాది లానే ఈ సారి కూడా ఆంధ్ర ప్రదేశ్‌లోని విశాఖపట్నంలోనూ ఐపీఎల్‌ మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. గత సీజన్ లో తొలి రెండు మ్యాచ్ లను వైజాగ్ లో నిర్వహించారు. అలానే ఈ సారి కూడా ఇప్పుడు వైజాగ్‌లో మ్యాచులు నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో వైజాగ్ క్రికెట్ అభిమానులను ఈ వార్త ఫుల్ ఖుషీ చేస్తోంది.

In IPL 2025 Vizag will host Delhi Capitals as their second home

ఆ ఇద్దరిలో ఒకడికి కెప్టెన్సీ..
ఈ మెగా లీగ్ లో పాల్గొనబోయే 10 ఫ్రాంచైజీల్లో 8 జట్లు తమ సారథులను ప్రకటించాయి. రెండు జట్లు మాత్రం ప్రకటించలేదు. అవే కేకేఆర్, దిల్లీ క్యాపిటల్స్. అయితే దిల్లీ క్యాపిటల్స్ కు కేఎల్ రాహుల్‌ లేదా అక్షర్ పటేల్‌లో ఒకరికి సారథ్య బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని క్రికెట్ వర్గాల సమాచారం. కానీ దాదాపుగా అక్షర్ పటేల్ కే కెప్టెన్సీ బాధ్యతలు ఇచ్చే ఛాన్స్ ఉందని మరో వాదన విపిపిస్తోంది. చూడాలి మరి ఎవరికి ఈ కెప్టెన్సీ దక్కుతుందో..

Story first published: Sunday, February 16, 2025, 17:27 [IST]
Other articles published on Feb 16, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+