Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వైజాగ్ వన్డేలో కోహ్లీ సాహసోపేత నిర్ణయం వెనుక అసలు కారణం ఇదీ

Vizag ODI: India win toss, opt to bat first against West Indies

హైదరాబాద్: ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా విశాఖపట్నం వేదికగా పర్యాటక వెస్టిండిస్ జట్టుతో బుధవారం జరుగుతోన్న రెండో వన్డేలో టాస్ గెలిచిన కెప్టెన్ విరాట్ కోహ్లీ అనూహ్యంగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. రాత్రి ఏడు గంటల నుంచి మంచు పడుతుండడంతో ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలవడం ఎంతో కీలకం.

టాస్ గెలిచిన కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకుంటాడని అంతా భావించారు. అయితే, కోహ్లీ అనూహ్యంగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. వాస్తవానికి రాత్రి 7 గంటల తర్వాత వైజాగ్‌లో మంచు కురుస్తుంది. దీంతో బంతిపై బౌలర్లకి పట్టుచిక్కడం కష్టమవుతుంది. అయినా... కోహ్లీ సాహసోపేత నిర్ణయం తీసుకున్నాడు.

1
44267
బౌలర్లపై ఉన్న విశ్వాసంతో

బౌలర్లపై ఉన్న విశ్వాసంతో

బౌలర్లపై ఉన్న విశ్వాసంతో తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు కోహ్లీ టాస్ అనంతరం వెల్లడించాడు. గత రెండు రోజులుగా ఎండలు బాగా కాస్తున్నాయి. మ్యాచ్‌ రోజు వర్షం పడే అవకాశాలు తక్కువే. ఒకవేళ బుధవారం వర్షం కురిసినా మ్యాచ్‌కు ఇబ్బందులు తలెత్తకుండా మైదాన సిబ్బంది అంతా సిద్ధం చేశారు.

టాస్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ

టాస్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ "మేము తొలుత బ్యాటింగ్ చేయాలనుకుంటున్నాం. వికెట్ చాలా బాగుంది. కానీ.. రెండో ఇన్నింగ్స్‌లో కాస్త నెమ్మదించే అవకాశం ఉంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. గువహటి వన్డేలో ఆడిన ఫాస్ట్ బౌలర్ ఖలీల్ అహ్మద్‌ స్థానంలో.. ఈ వన్డేకి కుల్దీప్ యాదవ్‌ని తీసుకున్నాం" అని కోహ్లీ చెప్పాడు.

తుది జట్టులో ఇద్దరు మణికట్టు స్పిన్నర్లు

"దీంతో.. తుది జట్టులో ఇద్దరు మణికట్టు స్పిన్నర్లు ఉన్నారు. ఛేదన సమయంలో ఈ స్పిన్నర్లతో వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్‌కి మిడిల్ ఓవర్లలో చిక్కులు తప్పవు. ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్ల కాంబినేషన్‌ కూడా బ్యాటింగ్ నిర్ణయానికి మరో కారణం. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించేలా ఉందని, పైగా తమ బౌలింగ్ టార్గెట్‌ను డిఫెండ్ చేయగలిగేలా ఉంది" అని కోహ్లీ తెలిపాడు.

ఒక మార్పుతో బరిలోకి దిగిన వెస్టిండిస్ జట్టు

మరోవైపు వెస్టిండిస్ జట్టు కూడా ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. ఆ జట్టు తరుపున ఒబెద్ మెక్‌కాయ్ అరంగేట్రం చేస్తున్నాడు. థామస్ స్థానంలో అతను జట్టులోకి వచ్చాడు. గువహటి వేదికగా జరిగిన తొలి వన్డేలో సునాయాసంగా గెలిచిన కోహ్లీ సేన.. ఇప్పుడు అచ్చొచ్చిన వైజాగ్ మైదానంలో జోరు కొనసాగించాలని భారత్ ఉవ్విళ్లూరుతోంది.

భారత్ తుది జట్టు:

విరాట్ కోహ్లి (కెప్టెన్), శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, అంబటి రాయుడు, రిషబ్ పంత్, మహేంద్రసింగ్ ధోని (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, చాహల్, ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీ

Story first published: Wednesday, October 24, 2018, 14:28 [IST]
Other articles published on Oct 24, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+