వివో స్పాన్సర్షిప్: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లీగ్‌గా ఐపీఎల్
హైదరాబాద్: 2018 నుంచి ఐదేళ్ల కాలానికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టైటిల్ హక్కులను ప్రముఖ చైనీస్ మొబైల్ తయారీ సంస్ధ వివో రూ. 2199 కోట్లకు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇది గత కాంట్రాక్టుతో పోలిస్తే 554 శాతం అధికం. తాజా బిడ్డింగ్ ప్రకారం వివో ఏడాదికి రూ.440 కోట్లు చెల్లించనుంది.
గత స్పాన్సర్ల కంటే వివో దాదాపు ఐదు రెట్లు ఎక్కువ చెల్లిస్తుంది. దీనిని బట్టి చూస్తే ఐపీఎల్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లీగ్‌గా అవతరించిందా? అంటే అవుననే అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. ఇప్పటివరకు ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన లీగ్‌గా ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ ఉంది. 2013 నుంచి 2016 వరకు ఏడాదిగాను రూ. 300 కోట్లు వెచ్చించి స్పాన్సర్లు ఈ లీగ్ టైటిల్ హక్కులను సొంతం చేసుకుంది.

ఏడాదికి రూ. 300 కోట్లు చెల్లించిన మాండలెజ్ ఇంటర్నేషనల్
ఐపీఎల్లో క్రికెట్ ఎలాగ ఆడతారో ఇంగ్లీషు ప్రీమియర్ లీగ్‌లో పుట్‌బాల్ ఆడతారు. పుట్‌బాల్‌కు ఎంతో ప్రాచుర్యం పొందిన ఈ ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ టైటిల్ హక్కులను మాండలెజ్ ఇంటర్నేషనల్ కంపెనీ దక్కించుకుంది. అయితే దీనికి ఒప్పందానికి సంబంధించిన ఫైనాన్షియల్ డిటేల్స్ బయటకు రానప్పటికీ, అనధికారికంగా ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ టైటిల్ హక్కులను పొందేందుకు గాను మాండలెజ్ ఇంటర్నేషనల్ కంపెనీ ఏడాదికి రూ. 300 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది.

ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ రికార్డుని బద్దలు కొట్టిన ఐపీఎల్
అయితే తాజాగా ఐపీఎల్ టైటిల్ హక్కులను వివో భారీ మొత్తంలో చెల్లించి ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ రికార్డుని సైతం బద్దలు కొట్టింది. 2017 సీజన్‌తో ఒప్పందం ముగియడంతో బీసీసీఐ టైటిల్ స్పాన్సర్షిప్ హక్కుల కోసం వేలం నిర్వహించింది. ఈ వేలంలో పాల్గొన్న వివో 2018 నుంచి 2022 వరకు రూ. 2199 కోట్లతో బిడ్ దాఖలు చేసింది.
ఐదేళ్ల కాలానికి గాను వివోకే టైటిల్ హక్కులు
మరో ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ఒప్పొ రూ.1430తో బిడ్ దాఖలు చేసింది. ప్రస్తుతం టీమిండియా ప్రధాన స్పాన్సర్‌గా ఒప్పొ ఉన్న సంగతి తెలిసిందే. అత్యధికంగా బిడ్ దాఖలు చేసిన వివోకి వచ్చే ఐదేళ్ల కాలానికి గాను టైటిల్ హక్కులను అప్పగిస్తున్నట్లు ఐపీఎల్ చీఫ్ రాజీవ్ శుక్లా మంగళవారం వెల్లడించారు.

2013లో రూ. 396 కోట్లకు పెప్సికో హక్కులు
2007లో ప్రారంభమైన ఇండియన్ క్యాష్ రిచ్ టోర్నీ ఐపీఎల్ టోర్నమెంట్‌లో మొదటి ఐదేళ్ల కాలానికి గాను హక్కులను డీఎల్‌ఎఫ్ దక్కించుకుంది. ఆ తర్వాత పెప్సీ, వివో స్పాన్సర్‌గా వ్యవహరించాయి. 2013లో రూ. 396 కోట్లకు గాను పెప్సికో హక్కులను దక్కించుకుంది. అయితే 2014-15 సంవత్సరానికి పెప్సికో నుంచి వివో హక్కులను టేకోవర్ చేసింది.

ఒక్కో సీజన్‌కు రూ.100 కోట్లు చెల్లించి వివో
2016, 2017 సీజన్లకుగాను ఒక్కో సీజన్‌కు రూ.100 కోట్లు చెల్లించి వివో హక్కులు సంపాదించింది. తాజా ఒప్పందం ప్రకారం 2018 నుంచి 2022 వరకు వివో టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. 2015లో రూ.200కోట్లతో బిడ్ దాఖలు చేసిన వివో ఇప్పుడు ఐదేళ్ల కాలానికి రూ.2199 కోట్లు దాఖలు చేసింది.

ఆయా జట్లతో ముగిసిన పదేళ్ల కాంట్రాక్టు
ఇదిలా ఉంటే 2018లో నిర్వహించబోయే ఐపీఎల్ వేలంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆటగాళ్లు పాల్గొంటారు. ఆయా జట్లతో పదేళ్ల కాంట్రాక్టు ముగియడంతో కొత్త కాంట్రాక్టులు ప్రారంభం కానున్నాయి. అంతేకాదు ఐపీఎల్‌లో రెండేళ్ల పాటు నిషేధానికి గురైన చెన్నై సూపర్‌కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తిరిగి ఈ వేలంలో పొల్గొంటాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications