రూ. 2,199 కోట్లతో ఒప్పందం: ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా వివో
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టైటిల్ స్పాన్సర్షిప్ హక్కులను ప్రముఖ చైనీస్ మొబైల్ తయారీ సంస్ధ వివో మరోసారి దక్కించుకుంది. 2017 సీజన్‌తో ఒప్పందం ముగియడంతో బీసీసీఐ టైటిల్ స్పాన్సర్షిప్ హక్కుల కోసం వేలం నిర్వహించింది.
ఈ వేలంలో పాల్గొన్న వివో 2018 నుంచి 2022 వరకు రూ. 2199 కోట్లతో బిడ్ దాఖలు చేసింది. ఇది గత కాంట్రాక్టుతో పోలిస్తే 554 శాతం అధికం కావడం విశేషం. మరో ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ఒప్పొ రూ.1430తో బిడ్ దాఖలు చేసింది.
వివోకే ఐపీఎల్ హక్కులు
ప్రస్తుతం టీమిండియా ప్రధాన స్పాన్సర్‌గా ఒప్పొ ఉన్న సంగతి తెలిసిందే. అత్యధికంగా బిడ్ దాఖలు చేసిన వివోకి వచ్చే ఐదేళ్ల కాలానికి గాను టైటిల్ హక్కులను అప్పగిస్తున్నట్లు ఐపీఎల్ చీఫ్ రాజీవ్ శుక్లా మంగళవారం వెల్లడించారు. ఈ మేరకు ఐపీఎల్ తన ట్విట్టర్ ఖాతాలో అధికారిక పోస్టు చేసింది.

ఐపీఎల్ తొలి టోర్నీలో డీఎల్‌ఎఫ్
2007లో ప్రారంభమైన ఇండియన్ క్యాష్ రిచ్ టోర్నీ ఐపీఎల్ టోర్నమెంట్‌లో మొదటి ఐదేళ్ల కాలానికి గాను హక్కులను డీఎల్‌ఎఫ్ దక్కించుకుంది. ఆ తర్వాత పెప్సీ, వివో స్పాన్సర్‌గా వ్యవహరించాయి. 2013లో రూ. 396 కోట్లకు గాను పెప్సికో హక్కులను దక్కించుకుంది. అయితే 2014-15 సంవత్సరానికి పెప్సికో నుంచి వివో హక్కులను టేకోవర్ చేసింది.

2018 నుంచి 2022 వరకు టైటిల్ స్పాన్సర్‌గా వివో
తాజా ఒప్పందం ప్రకారం 2018 నుంచి 2022 వరకు వివో టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. 2015లో రూ.200కోట్లతో బిడ్ దాఖలు చేసిన వివో ఇప్పుడు ఐదేళ్ల కాలానికి రూ.2199 కోట్లు దాఖలు చేసింది. ఇదిలా ఉంటే 2018లో నిర్వహించబోయే ఐపీఎల్ వేలంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆటగాళ్లు పాల్గొంటారు.

వచ్చే ఐపీఎల్‌లో చెన్నై, రాజస్ధాన్
ఆయా జట్లతో పదేళ్ల కాంట్రాక్టు ముగియడంతో కొత్త కాంట్రాక్టులు ప్రారంభం కానున్నాయి. అంతేకాదు ఐపీఎల్‌లో రెండేళ్ల పాటు నిషేధానికి గురైన చెన్నై సూపర్‌కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తిరిగి ఈ వేలంలో పొల్గొంటాయి. ఇదిలా ఉంటే 2017 నుంచి ఐదేళ్ల పాటు ప్రొ కబడ్డీ లీగ్ టైటిల్ స్పాన్సర్ హక్కులను కూడా రూ.300 కోట్లతో వివో దక్కించుకున్న సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications