'డబుల్' స్పెషల్: కోహ్లీకి రిచర్డ్స్ అపురూపమైన కానుక
ఆంటిగ్వా: జులై 24న జరిగిన తొలి టెస్టులో వెస్టిండిస్ జట్టుపై టీమిండియా రికార్డు స్థాయిలో ఇన్నింగ్స్ 92 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. విదేశాల్లో భారత జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించిన టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ప్రశంసలు అందుతున్నాయి.
తొలి టెస్టులో డబుల్ సెంచరీ సాధించి భారత జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీని వెస్టిండిస్ బ్యాటింగ్ లెజెండ్ సర్ వివియన్ రిచర్డ్స్‌తో పాటు ఆయన కుమారుడు మాలి అలెగ్జాండర్ రిచర్డ్స్ (32) అభినందించారు. భారత జట్టు బస చేస్తోన్న హోటల్‌కి వచ్చిన వీరిద్దరూ కోహ్లీని కలిసి అభినందించారు.
భారత్- వెస్టిండిస్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరిస్‌కు కామెంటేటర్‌గా వ్యవహారిస్తోన్న రిచర్డ్స్ కోహ్లీ డబుల్ సెంచరీపై ప్రశంసలు కురిపించాడు. క్లాసీ ఇన్నింగ్స్ ఆడాడంటూ కోహ్లీని ఆకాశానికెత్తాడు. రిచర్డ్స్ కుమారుడు మాలి రిచర్డ్స్ కూడా కోహ్లీకి వీరాభిమాని. టెస్ట్ విజయనాంతరం కోహ్లీని హోటల్‌లో కలసుకున్న మాలి ఓ అద్భుతమైన పెయింటింగ్‌ను కోహ్లికి బహుమతిగా ఇచ్చాడు.

'డబుల్' స్పెషల్: విరాట్ కోహ్లీకి అపురూపమైన కానుక
ఈ సందర్భంగా మాలి బీసీసీఐ వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్యూలో మాట్లాడుతూ తొలి టెస్టులో భాగంగా ఆంటిగ్వాకు కోహ్లీ వస్తున్నాడనే విషయం తెలుసుకుని ఎంతో సంతోషపడ్డానని పేర్కొన్నాడు. తన తండ్రి పేరిట ఉన్న స్టేడియంలో కోహ్లీ డబుల్ సెంచరీ సాధించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపాడు.

'డబుల్' స్పెషల్: విరాట్ కోహ్లీకి అపురూపమైన కానుక
క్రికెట్‌కు అందించిన సేవలకు గుర్తింపుగాను ఆంటిగ్వాలోని స్టేడియానికి సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియం అని వెస్టిండిస్ క్రికెట్ బోర్డు నామకరణం చేసింది. వెస్టిండిస్ జట్టు తరుపున 18 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన మాలి డబుల్ సెంచరీ సాధించిన సమయంలో కోహ్లీ ఇచ్చిన ఫోటో ఫోజుని పెయింటింగ్ రూపంలో కోహ్లీకి అందజేశాడు.

'డబుల్' స్పెషల్: విరాట్ కోహ్లీకి అపురూపమైన కానుక
బీసీసీఐ వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్యూ ప్రకారం మాలికి వెస్టిండిస్‌లో ఓ ఆర్ట్ గ్యాలరీ కూడా ఉందని తెలుస్తోంది. ఆంటిగ్వాలో కోహ్లీ సాధించిన డబుల్ సెంచరీ అతని క్రీడా జీవితంలో ఓ మైలు రాయిగా అభివర్ణించిన మాలి కోహ్లీకి అందజేసిన పెయింటింగ్ కేవలం ఒక్కరోజులే వేశామని చెప్పుకొచ్చాడు.
'డబుల్' స్పెషల్: విరాట్ కోహ్లీకి అపురూపమైన కానుక
కాగా టెస్టు సిరిస్ ప్రారంభం కాకముందు వెస్టిండిస్ బ్యాటింగ్ లెజెండ్ సర్ వివియన్ రిచర్డ్స్ భారత జట్టు బస చేసిన హోటల్‌కు వెళ్లి కెప్టెన్ కోహ్లీతో పాటు జట్టుకు కూడా శుభాకాంక్షలు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రిచర్డ్స్‌తో కలిగి దిగిన ఫోటోను ట్విట్టర్‌లో పోస్టు చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications