కోహ్లీ ఇంత పనిచేస్తాడనుకోలేదు: రిచర్డ్స్ సెల్యూట్
అంటిగ్వా: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిమానుల జాబితాలో తాజాగా విండీస్ మాజీ క్రికెటర్ సర్.వివియన్ రిచర్డ్స్ చేరారు. విరాట్ కోహ్లీని ప్రశంసలతో ముంచెత్తాడు. మ్యాచ్‌కు ముందు 'వివియన్ రిచర్డ్స్ ఇంటర్నేషనల్ స్టేడియంలో' ప్రాక్టీస్‌లో ఉన్న భారత ఆటగాళ్లను కలిశానని, ఆ సందర్భంగా కోహ్లీకి ఆల్ ది బెస్ట్ చెప్పానని రిచర్డ్స్ తెలిపారు.
తొవి మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో చెలరేగిన కోహ్లీ ఆటకు ఆయన ఫిదా అయిపోయాదడు. కేవలం ఆల్ ది బెస్ట్ చెప్పినందుకు ఇంత పని చేస్తాడని ఊహించలేదని ఆయన వ్యాఖ్యానించాడు. కోహ్లీ ఆటను ఆస్వాదించడం తనకెంతో ఆనందాన్ని కలిగించిందని తెలిపారు.
విరాట్ ఇన్నింగ్స్ చూడని వారు చాలా కోల్పోతారని, తాను తొలిసారి కోహ్లీ ఆటను చూశానని, అదీ డబుల్ సెంచరీతో విజృంభించడం చూశానని విడీస్ క్రికెట్ దిగ్గజం రిచర్డ్స్ చెప్పారు.

రిచర్డ్స్‌తో భేటీపై కోహ్లీ
రిచర్డ్స్‌తో భేటీ తర్వాత విరాట్ కోహ్లీ ట్వీట్ చేస్తూ ఎంతో గుర్తుంచుకోదగిన క్షణాలని వ్యాఖ్యానించాడు. అంతటి గొప్ప వ్యక్తితో సమావేశం అయినందుకు ఆనందంగా ఉందని చెప్పాడు. ఆ ఫోటోతో కోహ్లీ ట్వీట్ చేశాడు.

రిచర్డ్స్ కోహ్లీ ఇన్నింగ్స్ చూశాడు...
టీవీ వ్యాఖ్యాతగా వ్యవహరించిన వివియన్ రిచర్డ్స్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఆసాంతం ఆస్వాదించాడు. టెస్టు మ్యాచుల్లో కోహ్లీ చేసిన తన తొలి డబుల్ సెంచరీకి రిచర్డ్స్ ప్రత్యక్ష సాక్షి

అత్యద్భుతం...
వివియన్ రిచర్డ్స్ క్రికెట్ మైదానంలో డబుల్ సెంచరీ చేయడం అత్యద్భుతమని రిచర్డ్స్ బిసిసిఐ వెబ్‌సైట్‌లో అన్నాడు. బ్యాట్స్‌మన్‌గా కోహ్లీ బ్యాటింగ్ తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని, వెస్టిండీస్‌కు వ్యతిరేకంగా చేసినప్పటికీ తానకు ఆనందంగానే ఉందని రిచర్డ్స్ అన్నాడు.
4. వారంతా మిస్సయినట్లే...

కోహ్లీ ఇంత పనిచేస్తాడనుకోలేదు: రిచర్డ్స్ సెల్యూట్
మైదానంలో లేనివారు అత్యంత ప్రత్యేకమైన కోహ్లీ ఇన్నింగ్సును మిస్సయ్యారని, తాను కోహ్లీ ఇన్నింగ్సును చూశానని, సంతోషించానని రిచర్డ్స్ అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications