Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సర్ వివియన్ రిచర్డ్స్‌కు అరుదైన అవార్డు అందించిన వెస్టిండీస్ క్రికెట్

Vivian Richards has been Honoured with the Order of the Caribbean Community

వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం సర్ వివియన్ రిచర్డ్స్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఆర్డర్ ఆఫ్ ది కరీబియన్ కమ్యూనిటీ (CARICOM)అవార్డును ఆయన అందుకున్నాడు. సురినామ్‌లో జరిగిన 43వ ప్రభుత్వాధినేతల సమావేశంలో ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును ఆయన అందుకున్నారు. ఈ విషయాన్ని క్రికెట్ వెస్టిండీస్ (CWI) తమ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో షేర్ చేసింది. రిచర్డ్స్‌ను ఆల్ టైం విధ్వంసక బ్యాటర్‌గా పేర్కొంటుంటారు.

1970, 1980దశకాలల్లో అప్పటి శక్తివంతమైన వెస్టిండీస్ జట్టులో వివియన్ రిచర్డ్స్ కీలక ప్లేయర్‌గా ఉండేవాడు. అతను తన దూకుడు పవర్-హిట్టింగ్ టెక్నిక్‌లతో మ్యాచ్‌ను ప్రత్యర్థి నుంచి లాగేసుకుని ఒంటి చేత్తో గెలిపించగలిగేవాడు. అతను టెస్ట్ క్రికెట్‌లో కూడా అత్యధ్భుతంగా రాణించాడు.

ఇక రిచర్డ్స్ 1975, 1979లో తొలి రెండు సార్లు జరిగిన వన్డే ప్రపంచ కప్‌లను గెలుచుకున్న కరీబియన్ జట్టులో కీలక ప్లేయర్. అతను 1979 ప్రపంచకప్ ఫైనల్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 138పరుగులు చేశాడు. ఇక ఈ అరుదైన అవార్డు అందిస్తున్న సందర్భంగా CWI అధ్యక్షుడు రికీ స్కెరిట్ మాట్లాడుతూ.. 'సీడబ్ల్యూఐ డైరెక్టర్ల బోర్డు తరఫున, వెస్టిండీస్ క్రికెట్ కమ్యూనిటీ తరపున నేను సర్ వివ్‌కు ఈ అత్యంత ప్రతిష్ఠాత్మకమైన CARICOM అవార్డు అందిస్తూ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను' అని రికీ స్కెరిట్ పేర్కొన్నారు.

దాదాపు రెండు దశాబ్దాల పాటు క్రికెట్ కెరీర్ కొనసాగించిన వీవీ రిచర్డ్స్ తన హయాంలో ఎన్నో రికార్డులను అతను సాధించాడు. 1974 నుంచి 1991 మధ్య 121టెస్టులు, 187వన్డే ఇంటర్నేషనల్స్‌ మ్యాచ్‌లు అతను ఆడాడు. టెస్ట్ ఫార్మాట్‌లో 8540 పరుగులు, వన్డేల్లో 6721 పరుగులు చేశాడు. రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా వెస్టిండీస్ జట్టులో అతను కీలక ప్లేయర్. అతను టెస్టుల్లో 24సెంచరీలు, వన్డేల్లో 11 సెంచరీలు నమోదు చేశాడు.

Story first published: Tuesday, July 5, 2022, 17:04 [IST]
Other articles published on Jul 5, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+