For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రిచర్డ్స్ షర్ట్ లేకుండా చేతిలో బ్యాట్‌ పట్టుకుని వచ్చాడు.. చంపేస్తాడనుకున్నా: పాక్ దిగ్గజం

Viv Richards was standing shirtless with a bat in his hand, When Wasim Akram’s sledging

కరాచీ: ఒక మ్యాచ్‌లో తాను తీవ్ర స్థాయిలో స్లెడ్జింగ్‌ చేయడంతో ఆగ్రహానికి గురైన వెస్టిండీస్‌ దిగ్గజం వివ్‌ రిచర్డ్స్‌.. మ్యాచ్ అనంతరం తనను కొట్టడానికి వచ్చినట్టు పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ వసీం అక్రమ్‌ గుర్తు చేస్తున్నాడు. షర్ట్ విప్పేసి చేతిలో బ్యాట్‌ పట్టుకుని పాక్ డ్రెస్సింగ్ రూంకి రిచర్డ్స్ వెళ్లగా.. అక్రమ్‌ వణికిపోయాడట. 1988లో బార్బడోస్ టెస్టులో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు పాక్ మాజీ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అక్రమ్‌ తెలిపాడు.

వివ్‌ను మాటలతో కవ్వించా:

వివ్‌ను మాటలతో కవ్వించా:

టీమిండియా మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రాతో జరిగిన చాట్ సందర్భంగా వసీం అక్రమ్ అప్పటి సంగతులను గుర్తుచేసుకున్నాడు. అక్రమ్‌ మాట్లాడుతూ... '1988లో బార్బడోస్ టెస్ట్ మ్యాచ్‌లో ఒకసారి బౌన్సర్‌ వేయడంతో రిచర్డ్స్‌ క్యాప్‌ కిందపడింది. దీన్ని అతడు సీరియ్‌సగా తీసుకున్నాడు. ఆ తర్వాత వివ్‌ను నా మాటలతో కవ్వించా. కోపం వచ్చిన రిచర్డ్స్‌ అలా చేయొద్దని హెచ్చరించాడు. సరిగా అర్థం కాకపోయినా.. నేను వెళ్లి రిచర్డ్స్‌ కొడతానన్నాడని అప్పటి కెప్టెన్‌ ఇమ్రాన్‌ ఖాన్‌కు చెప్పా. అవేమి పట్టించుకోవద్దన్నాడు' అని తెలిపాడు.

 బ్యాట్‌పట్టుకుని డ్రెస్సింగ్‌ రూమ్‌కు వచ్చాడు:

బ్యాట్‌పట్టుకుని డ్రెస్సింగ్‌ రూమ్‌కు వచ్చాడు:

'మ్యాచ్ జరుగుతుండగా ఇమ్రాన్‌ వచ్చి బౌన్సర్లు వేయాలని చెప్పడంతో అలాగే చేశా. అయితే ఆఖరి సెషన్‌ ఆఖరి బంతికి రిచర్డ్స్‌ను ఔట్ చేశా. ఆపై అతిగా సంబరాలు చేసుకున్నా. ఇదంతా రిచర్డ్స్‌ చూసాడు. మ్యాచ్ అనంతరం రిచర్డ్స్‌ బ్యాట్‌పట్టుకుని పాక్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌కు వద్దకు వచ్చాడు. అక్రమ్ బయటికి రా అని పిలిచాడు. నాకెంతో భయమేసింది. ఇమ్రాన్‌ కూడా నువ్వే సర్దిచెప్పుకోవాలంటూ సైడైపోయాడు. దీంతో చేసేదేంలేక నేరుగా రిచర్డ్స్‌ దగ్గరకు వెళ్లి క్షమాపణలు కోరా. దీంతో బాగుపడకపోతే.. చస్తావని వివ్‌ హెచ్చరించాడు' అని అక్రమ్‌ చెప్పాడు.

 విశ్రాంతి తీసుకుంటే ఉత్తమమం:

విశ్రాంతి తీసుకుంటే ఉత్తమమం:

టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కౌంటీ క్రికెట్ ఆడటం కంటే.. విశ్రాంతి తీసుకుంటే ఉత్తమమని వసీం అక్రమ్ అన్నాడు. 'బుమ్రా ప్రస్తుతం టీమిండియాలో టాప్ బౌలర్. ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లలో ఒకడు. ఇప్పటికే మూడు ఫార్మాట్ల క్రికెట్‌ ఆడుతూ బిజీగా ఉన్నాడు. మా కాలంలో పోలిస్తే.. ఇప్పుడు కౌంటీ క్రికెట్‌లో ఎన్నో మార్పులు వచ్చాయి. అంతర్జాతీయ మ్యాచ్‌లు లేని సమయంలో అతను విశ్రాంతి తీసుకుంటే ఉత్తమం' అని అక్రమ్ పేర్కొన్నాడు.

టాలెంట్‌ అనే ట్యాగ్‌ను ఎంజాయ్‌ చేసేవాడిని:

టాలెంట్‌ అనే ట్యాగ్‌ను ఎంజాయ్‌ చేసేవాడిని:

'నేను క్రికెట్‌ ఆడే తొలి రోజుల్లో నా టాలెంట్‌ను ఇమ్రాన్‌ భాయ్‌, మియాందాద్‌ భాయ్‌, ముదాసర్‌ నజార్‌లు మాత్రమే గుర్తించారు. ఈ కుర్రాడిలో టాలెంట్‌ ఉందని వారు పదే పదే చెబుతూ ఉండేవారు. అది నాకు అర్థం అయ్యేది కాదు' అని గత జ్ఞాపకాలను అక్రమ్ గుర్తు చేసుకున్నాడు. ఆ ముగ్గురి నుండి వేరు వేరు విషయాలను నేర్చుకున్నానన్నాడు. అయితే తాను టాలెంట్‌ అనే ట్యాగ్‌ను ఎంజాయ్‌ చేసేవాడినని అక్రమ్‌ తెలిపాడు.

Story first published: Tuesday, May 12, 2020, 10:23 [IST]
Other articles published on May 12, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+