న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐసీసీ పోస్ట్‌.. తన ఫొటో లేదంటూ రోహిత్ అసంతృప్తి!!

Viv Richards to Virat Kohli: Rohit Sharma takes dig at ICC over best pull shot tweet

ముంబై: క్రికెట్‌ చరిత్రలోనే పుల్‌ షాట్‌ను చాలా అందంగా ఆడే బ్యాట్స్‌మెన్‌లో టీమిండియా ఓపెనర్ రోహిత్‌ శర్మ ఒకడు. రోహిత్‌ ఆడే ఆ చక్కటి పుల్‌షాట్లకు ఫిదా కాని వారుండరు. ప్రస్తుత క్రికెట్‌లో ఈ షాట్‌ ఆడడంలో అతడిని మించిన వారు లేరనే వ్యాఖ్యలు వినిపిస్తుంటాయి. కానీ.. ఐసీసీ అతడి నైపుణ్యాన్ని గుర్తించలేకపోయింది. తాజాగా ఐసీసీ నిర్వహించిన ఓ పోల్‌ను చూసిన రోహిత్‌ వ్యంగ్యంగా స్పందించాడు.

కరోనా వ్యాప్తి నిర్మూలన కోసం ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్న యోధులకు వందనం: సెహ్వాగ్కరోనా వ్యాప్తి నిర్మూలన కోసం ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్న యోధులకు వందనం: సెహ్వాగ్

రోహిత్ అసంతృప్తిరోహిత్ అసంతృప్తి:

రోహిత్ అసంతృప్తిరోహిత్ అసంతృప్తి:

ఐసీసీ ట్విటర్‌ పేజీలో కింది బ్యాట్స్‌మెన్‌లో ఎవరు పుల్‌షాట్‌ను చాలా బాగా ఆడతారంటూ ఒక పోల్‌ పెట్టి.. వివ్‌ రిచర్డ్స్‌, రికీ పాంటింగ్‌, హెర్ష్‌లె గిబ్స్‌, విరాట్‌ కోహ్లీల ఫొటోలు ఉంచింది. దీనిపై రోహిత్‌ ఆసక్తికర రీతిలో స్పందించాడు. ఇందులో ఒకరు మిస్సయినట్లున్నారే.. అంటూ ట్వీట్‌ చేశాడు. 'ఇందులో ఒకరు మిస్‌ అయ్యారు. నా అంచనా ప్రకారం వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేయడం అంత సులువు కాదు' అని ట్వీట్‌ చేశాడు.

ఫెయిర్‌ ప్లే, రోహిత్‌

ఫెయిర్‌ ప్లే, రోహిత్‌"

ఈ ట్వీట్‌ వైరల్‌ కావడంతో.. చాలామంది నెటిజన్లు రోహిత్‌ శర్మకు మద్దతుగా ట్వీట్లు వేశారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కన్నా రోహిత్‌ పుల్‌ షాట్‌ బాగా ఆడగలడని.. అతణ్ని విస్మరించి ఐసీసీ తప్పు చేసిందని వ్యాఖ్యానించారు. రోహిత్ ట్విట్‌కు స్పందిస్తూ ఐసీసీ ఓ ట్విట్ చేసింది. అందులో రోహిత్ నిజాయితిగల ఆటగాడు అంటూ తాను ఆడిన పుల్ షాట్‌కు సంబంధిన ఓ వీడియోను పోస్ట్ చేసింది. 'ఫెయిర్‌ ప్లే, రోహిత్‌' అనే వ్యాఖ్యను ఐసీసీ జోడించింది.

రోహిత్‌ ది బెస్ట్‌:

రోహిత్‌ ది బెస్ట్‌:

ఐసీసీ చేసిన ట్వీట్‌ వైరల్‌ కావడంతో పుల్‌షాట్‌ ఆడటంలో రోహిత్‌ శర్మ ది బెస్ట్‌ అని కొందరు మాజీలు కామెంట్‌ చేస్తున్నారు. టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ ఐసీసీ పోస్ట్‌ను షేర్‌ చేస్తూ.. రోహిత్‌, పాంటింగ్‌ల పేరును జతచేశాడు. ఇక ఇంగ్లీష్ మాజీ కెప్టెన్ కెవిన్‌ పీటర్సన్‌, రికీ పాంటింగ్‌లు దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌ ఆండ్రూ హడ్సన్‌ పేరును ట్యాగ్‌ చేశారు.

వరుసగా పదకొండు రోజులు:

కరోనా వైరస్‌ ప్రభావం క్రీడా రంగంపై భారీగానే ఉంది. ఇప్పటికే అన్ని టోర్నీలు, సిరీస్‌లు, పర్యటనలు రద్దయ్యాయి. అంతేకాకుండా వరుసగా పదకొండు రోజులు ప్రపంచవ్యాప్తంగా ఒక్క క్రికెట్‌ టోర్నీ జరగలేదు. టోర్నీలు, ప్రాక్టీస్‌ సెషన్స్‌ లేకపోవడంతో ఆటగాళ్లు ఇంటికే పరిమితమయ్యారు. అయితే క్రికెటర్లు ఇంట్లో ఖాళీగా ఉంటుండటంతో సోషల్‌ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటున్నారు. ఈ ఖాళీ సమయంలో తాము చేస్తున్న పనులు, కుటుంబంతో సరదాగా గడుపుతున్న విషయాలను అభిమానులతో సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.

Story first published: Monday, March 23, 2020, 9:59 [IST]
Other articles published on Mar 23, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X