
మైకేల్ వాన్ ప్రత్యక్షంగా చూశానంటూ
ఇదిలా ఉంచితే, పెర్త్ వేదికగా శుక్రవారం నుంచి జరగనున్న రెండో టెస్టుకు బయల్దేరే క్రమంలో టీమిండియా విమాన ప్రయాణమైంది. అయితే ఇక్కడో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుందట. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ ప్రత్యక్షంగా చూశానంటూ సోషల్ మీడియా వేదికగా చెప్పడం చర్చనీయాంశమైంది. ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న మ్యాచ్‌లకు ప్రస్తుతం వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న వాన్.. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు టిక్కెట్లను త్యాగం చేస్తుండగా ప్రత్యక్షంగా చూశారట.
ఇషాంత్, బుమ్రా, షమీలు బౌలింగ్‌లో రాణిస్తే..
ఈ విషయాన్ని తానే సోషల్ మీడియా వేదికగా పోస్టు చేశారు. ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో తీవ్రంగా శ్రమించిన ఫాస్ట్ బౌలర్లకు విశ్రాంతి తీసుకునేందుకు తమ బిజినెస్ క్లాస్ టిక్కెట్లను ఇచ్చేశారట. ఇషాంత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా, మొహమ్మద్ షమీలు బౌలింగ్‌లో రాణిస్తే.. అశ్విన్ బ్యాటింగ్‌లో సైతం ఇరగదీశాడు. ఈ క్రమంలోనే ఫేసర్లకు విశ్రాంతినివ్వాలని యోచించి ఇలా నిర్ణయం తీసుకున్నారట.

మరింత రిలాక్స్‌డ్‌గా ఫీల్ అయితే
ఈ సంఘటనను తన అధికారిక ట్విట్టర్ ద్వారా వెల్లడించిన మైకెల్ వాన్ 'అడిలైడ్ నుంచి వెళ్లనున్న పర్యటనలో విరాట్ కోహ్లీ.. అనుష్క శర్మలు తమ బిజినెస్ హోదా టిక్కెట్లను త్యాగం చేశారు. టీమిండియా ఫేసర్లకు మరింత విశ్రాంతినివ్వాలనే యోచనలో వాళ్లు అలా చేశారు. మరింత రిలాక్స్‌డ్‌గా ఫీల్ అయితే తర్వాతి మ్యాచ్‌లో బాగా రాణిస్తారనే నమ్మకంతో ఇలా చేసుండొచ్చు. కెప్టెన్ తన ఆటతీరుతోనే తన మానవత్వాన్ని కూడా మనస్సులను గెలుచుకుంటున్నాడు' అని ట్వీట్ చేశారు.

ధోనీని అనుసరిస్తూ బౌలర్లకు ఎక్కువ
ఈ తరహాలో చూస్తుంటే విరాట్ కోహ్లీ టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని అనుసరిస్తూ బౌలర్లకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలుస్తోంది. తొలి టెస్టును 31పరుగుల తేడాతో గెలుచుకున్న టీమిండియా రెండో టెస్టును పెర్త్ వేదికగా శుక్రవారం నుంచి ఆడనుంది.


Click it and Unblock the Notifications
