
హైదరాబాద్: ఐపీఎల్‌లో భాగంగా జరుగుతున్న క్రికెట్ మ్యాచ్‌లలోనే పుట్టిన రోజు వేడుకలు సైతం జరుపుకుంటున్నారు క్రికెటర్లు. ఈ నేపథ్యంలో పంజాబ్ జట్టు ఆటగాడు, భారత జట్టు క్రికెటర్ కేఎల్ రాహుల్ ఈ రోజు(ఏప్రిల్ 18) 26వ పుట్టిన రోజు జరుపుకొంటున్నాడు. ఈ సందర్భంగా సహచర ఆటగాళ్లు, అభిమానులు రాహుల్‌కు సామాజిక మాధ్యమాల వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తోన్న రాహుల్‌కు ఆ జట్టు సభ్యులు, ఫ్రాంఛైజీ నిర్వాహకులు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం పంజాబ్ జట్టు మొహాలీలో ఉంది. సహచర ఆటగాళ్ల మధ్య రాహుల్ పుట్టిన రోజు వేడుకలు జరుపుకొన్నాడు. యువరాజ్, గేల్‌తో పాటు మరికొందరు ఆటగాళ్లు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
ఐతే, బర్త్‌డే బాయ్ రాహుల్ కట్ చేసేందుకు ఏర్పాటు చేసిన కేక్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఇంతకీ ఆ కేకులో అంత ప్రత్యేకత ఏముంది అనే కదా మీ సందేహం. గేల్ ముఖం చుట్టూ పండ్ల ముక్కలు ఉంచి ఇదే బర్త్‌డే కేక్ అని సహచరులు రాహుల్‌ను ఆట పట్టించారు. కేక్ స్థానంలో గేల్ ఇలా వచ్చాడు.
కడక్ లడ్కే రాహుల్ హ్యాపీ బర్త్‌డే . భవిష్యత్తులోనూ క్రికెట్‌లో అద్భుతంగా రాణించు: వీరేంద్ర సెహ్వాగ్
హ్యాపీ బర్త్ డే సోదరా. నా జోకులకు ఎప్పుడూ నవ్వుతూనే ఉండు. ఈ రోజును బాగా ఆస్వాదించు: హార్దిక్ పాండ్య
మా బిగ్ హిట్టర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు: కింగ్స్ ఎలెవన్ పంజాబ్