For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గ్రేట్ మ్యాన్: ముత్తయ్యకు సెహ్వాగ్ బర్త్‌డే విషెస్ ఇలా

శ్రీలంక స్పిన్ లెజెండ్ ముత్తయ్య మురళీధరన్‌కు టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశాడు.

By Nageshwara Rao

హైదరాబాద్: శ్రీలంక స్పిన్ లెజెండ్ ముత్తయ్య మురళీధరన్‌కు టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. 1972 ఏప్రిల్ 17న జన్మించిన ముత్తయ్య మురళీధరన్‌కు సోమవారంతో 45వ వసంతంలోకి అడుగుపెట్టాడు.

ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌లో ముత్తయ్య మురళీధరన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక వీరేంద్ర సెహ్వాగ్ కింగ్స్‌ విషయానికి వస్తే కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు మెంటార్‌గా కొనసాగుతున్నాడు.

ముత్తయ్య పుట్టినరోజుని పురస్కరించుకుని 'మౌత్ ఆయా (చావొచ్చి పడింది) మురళీధరన్' అనుకుంటుండేవారని సెహ్వాగ్ చమత్కరిస్తూ ట్వీట్ చేశాడు. అతని బౌలింగ్‌లో ఆడడం ఎంత కష్టమో చెప్పడానికి ముత్తయ్య‌ను 'మౌత్ ఆయా' అని వ్యాఖ్యానించిన సెహ్వాగ్ 'గొప్ప మనిషికి జన్మదిన శుభాకాంక్షలు' అంటు ట్వీట్ చేశాడు.

133 టెస్టు మ్యాచ్‌లాడిన ముత్తయ్య మురళీధరన్ 800 వికెట్లు పడగొట్టాడు. అంతేకాదు 22 సార్లు పది వికెట్లు, 67 సార్లు ఐదు వికెట్లు తీసుకున్న ఏకైక బౌలర్ ముత్తయ్యే కావడం విశేషం. మూడు ఫార్మెట్లలో కలిపి 1347 వికెట్లు తీశాడు. ఇండియాకు చెందిన ప్రజ్ఞాన్ ఓజా ముత్తయ్య మురళీధరన్ 800వ వికెట్ కావడం విశేషం.

బ్యాటింగ్‌లో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఎలాగైతే రికార్డులు సాధించాడో, అలా బౌలింగ్‌లో ముత్తయ్య తన పేరిట అనేక రికార్డులను నెలకొల్పాడు.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+