హైదరాబాద్: క్రికెట్‌కు వీడ్కోలు పలికిన టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్విట్టర్‌లో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. నిత్యం ట్విట్టర్‌లో చలాకీగా ఉంటూ తనదైన ట్వీట్లతో అభిమానులను అలరిస్తుండటాన్ని మనం చూశాం. అప్పుడప్పుడు అభిమానుల ట్వీట్లకు సైతం తన స్పందనను తెలియజేస్తుంటాడు.

తాజాగా, బుధవారం ఆనంద్ అనే ఓ అభిమాని తన తల్లికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపాలని సెహ్వాగ్‌ను ట్విట్టర్ ద్వారా కోరాడు. దీనికి స్పందించిన సెహ్వాగ్ ట్విట్టర్లోనే ఆనంద్ తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. సెహ్వాగ్ నుంచి ఈ స్పందన రావడంతో ఆనంద్ ఒక్కసారిగా ఉబ్బితబ్బిబ్బయ్యాడు.
అంతేకాదు తన తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపినందుకు ఆనంద్ సంతోషించి సెహ్వాగ్‌కు ధన్యవాదాలు తెలిపాడు. తన తల్లి ఎంతో సంతోషించిందని, ఆమె సంతోషం చూసి తనకూ ఆనందంగా వేసిందని ట్విట్టర్‌లో తెలిపాడు.