ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన బౌలర్ అంటే అతనే: సెహ్వాగ్


హైదరాబాద్: వైవిధ్యంగా ట్వీట్లు చేయడంలో సెహ్వాగ్ దిట్ట. అదే సందర్భమైనా సరే.. ప్రత్యేకమైన రీతిలో ట్వీట్ చేసి అందరిలో ప్రత్యేకతను చాటుకుంటాడు. ఇదే క్రమంలో దక్షిణాఫ్రికా బౌలర్ డేల్ స్టెయిన్‌కు ట్విట్టర్ వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు సెహ్వాగ్. '35 పుట్టినరోజు శుభాకాంక్షలు జరుపుకుంటున్న డేల్ స్టెయిన్‌కు శుభాకాంక్షలు. స్టెయిన్ బౌలింగ్ వేస్తే.. ప్రకృతి ఉన్న దానికంటే ఇంకా పచ్చగా కనిపిస్తుంది.' అంటూ సెటైరికల్ పంచ్ వేసి శుభాకంక్షలు తెలిపాడు.
గాయం కారణంగా సిరీస్ నుంచి తప్పుకోవాల్సి:
గతేడాది టీమిండియా ముగించుకున్న దక్షిణాఫ్రికా పర్యటనలో డేల్ స్టెయిన్ గాయం కారణంగా సిరీస్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అనంతరం వచ్చే నెలలో శ్రీలంకతో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు డేల్ స్టెయిన్ అందుబాటులోకి రానున్నాడని ఆ దేశ క్రికెట్ బోర్డు వెల్లడించింది. ఈ సందర్భంగా డేల్ స్టెయిన్ మాట్లాడుతూ "నా టార్గెట్ 100 టెస్టులు, 500 వికెట్లు , 2019 ప్రపంచకప్" అని పేర్కొన్నాడు.
సచిన్ టెండూల్కర్, ఐసీసీ కూడా శుభాకాంక్షలు:
ఈ క్రమంలో స్టెయిన్‌కు టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. 'నువ్వు సంతోషంగా, ఆయురారోగ్యాలతో ఉండాలి. పుట్టిన రోజు శుభాకాంక్షలు' అంటూ ట్విట్టర్ ద్వారా విషెస్ తెలియజేశారు. దానికి బదులుగా మీ నుంచి విషెస్ అందడం చాలా సంతోషాన్ని కలిగించింది. అని పేర్కొన్నాడు. ఇలా క్రికెటర్లతో పాటు ఐసీసీ (అంతర్జాతీయ క్రికెట్ మండలి) కూడా తన తరపునుంచి శుభాకాంక్షలు తెలియజేసింది.
14 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో సఫారీ జట్టు:
2004లో ఇంగ్లాండ్‌పై టెస్టు అరంగేట్రం చేసిన స్టెయిన్ అతి తక్కువ కాలంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నాడు. తన 14 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో సఫారీ జట్టు తరుపున ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. అయితే, ఇటీవల కాలంలో వరుస గాయాలతో జట్టుకు దూరమయ్యాడు.

షాన్ పొలాక్ సాధించిన (421) అత్యధిక వికెట్లు రికార్డు:
క్రికెట్ కెరీర్‌లో ఎన్నో మైలురాళ్లను సాధించిన డేల్ స్టెయిన్ టెస్టుల్లో మరో మూడు వికెట్లు తీస్తే, దక్షిణాఫ్రికా తరపున అత్యధిక టెస్టు వికెట్లు సాధించిన ఆటగాడిగా అరుదైన రికార్డుని నెలకొల్పనున్నాడు. దక్షిణాఫ్రికా తరపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు(421) సాధించిన రికార్డు షాన్ పొలాక్ పేరిట ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications