హైదరాబాద్: ఓపెనర్‌గా తన బ్యాటింగ్‌తో ఎన్నో రికార్డులను సృష్టించిన వీరేంద్ర సెహ్వాగ్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత ట్విట్టర్ కింగ్‌గా అదే స్థాయిలో అభిమానులకు ఆనందాన్ని పంచుతున్నాడు.
ఆదివారం (ఫిబ్రవరి 5) టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ 27వ పుట్టినరోజుని జరుపుకున్నాడు. భువీ పుట్టినరోజు సందర్భంగా సెహ్వాగ్ తనదైశ శైలిలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. అంతేకాదు భువనేశ్వర్ బౌలింగ్‌లో గొప్పదనాన్ని భార్యల మూడ్‌తో పోల్చుతూ సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.
భార్య మూడ్ ఎలా మారిపోతుందో తెలుసుకోవడం భర్తకు ఎంత కష్టమో.. అచ్చంగా అలాగే భువీ ఇన్ స్వింగర్లు, ఔట్ స్వింగర్లను గొప్ప బ్యాట్స్‌మన్ గ్రహించడం అసాధ్యమని ట్వీట్టర్‌లో సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. హ్యాపీ బర్త్‌డే భువీ అని రాసుకొచ్చి ట్విట్టర్ వేదికగా భువనేశ్వర్ కుమార్‌కి బర్త్‌డే విషెస్ చెప్పాడు.
ఉత్తర ప్రదేశ్ తరుపున రంజీ క్రికెట్‌లో రాణిస్తున్న భువనేశ్వర్ ఇటీవల ఇంగ్లాండ్‌తో ముగిసిన వన్డే సిరిస్‌లో కూడా సత్తా చాటాడు. తొలి వన్డేని మిస్ అయినా, ఆ తర్వాత రెండు వన్డేల్లో తన బౌలింగ్‌తో టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో సన్ రైజర్స్ తరుపున ఆడుతున్నాడు. భారత్ తరుపున 59 వన్డేలాడిన భువీ 61 వికెట్లు తీసుకున్నాడు. ఇక 16 టెస్టులాడి 42 వికెట్లు తీసుకున్నాడు. ఇక ఐపీఎల్‌లో 102 మ్యాచ్‌లాడి 108 వికెట్లు తీసుకున్నాడు.