303 నాటౌట్: కరుణ్ నాయర్‌కు సెహ్వాగ్ ట్రేడ్ మార్క్ ట్వీట్
చెన్నై: తన కెరీర్‌లో ఆడుతున్న మూడు టెస్టులోనే ట్రిపుల్ సెంచరీ చేసిన కరుణ్ నాయర్‌కు టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ వెల్‌కమ్ చెప్పాడు. చెన్నైలో జరుగుతున్న చివరి టెస్టులో టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ కరుణ్ నాయర్ అరుదైన రికార్డును నెలకొల్పాడు.
ఈ టెస్టులో 303 పరుగులు చేసిన నాయర్ నాటౌట్‌గా నిలిచాడు. దీంతో టీమిండియా తరపున టెస్ట్ క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీ చేసిన రెండవ ఆటగాడిగా గుర్తింపు పొందాడు. గతంలో టెస్టుల్లో భారత్ తరపున రెండు ట్రిపుల్ సెంచరీ సాధించిన ఆటగాడిగా సెహ్వాగ్ చరిత్ర సృష్టించాడు.
తాజాగా ఇంగ్లాండ్‌తో జరిగిన చివరి టెస్టులో 381 బంతులు ఎదుర్కొన్న నాయర్ 32 ఫోర్లు, 4 సిక్సర్లతో ట్రిపుల్ సెంచరీ సాధించాడు. తద్వారా ట్రిపుల్ సెంచరీ సాధించిన యంగెస్ట్ క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో సాధించిన తొలి సెంచరీనే ట్రిపుల్ సెంచరీగా మలచిన తొలి భారత బ్యాట్స్‌మన్‌గా కరుణ్ నాయర్ చరిత్ర సృష్టించాడు.
టెస్టు క్రికెట్ చరిత్రలో గ్యారీ సోబర్స్, బాబ్ సింప్సన్ తర్వాత తొలి సెంచరీనే ట్రిపుల్ సెంచరీగా మార్చిన మూడో ప్లేయర్ కరుణ్ నాయర్ కావడం గమనార్హం. చెన్నై టెస్టులో కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీ సాధించడంతో ఎలైట్ గ్రూపులో చేరాడు.
సెహ్వాగ్ ట్వీట్
కరుణ్ ట్రిపుల్ సెంచరీ చేసిన సందర్భంగా సోమవారం సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. గత 12 ఏళ్లుగా ఒంటరిగా ఉన్నానంటూ, 300 క్లబ్‌లోకి వెల్కమ్ అంటూ కరుణ్‌కు ఆల్ ద బెస్ట్ చెప్పాడు.
క్రిస్ గేల్ ఇలా
క్రిస్ గేల్ ఇలా
ప్రధాని నరేంద్రమోడీ
ట్రిపుల్ సెంచరీ సాధించిన కరుణ్ నాయర్ కు ప్రధాని నరేంద్రమోడీ శుభాకాంక్షలు తెలిపారు.
హార్భజన్ సింగ్
తొలి టెస్టు సెంచరీని ట్రిపుల్ సెంచరీగా మలచిన కరుణ్ నాయర్ కు కంగ్రాట్స్ అంటూ హార్భజన్ సింగ్ శుభాకాంక్షలు తెలిపాడు.
అనురాగ్ ఠాకూర్
బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ ఈ విధంగా స్పందించారు.
ఐసీసీ
ట్విట్టర్ లో ఐసీసీ ఇలా
హార్షా బోగ్లే
హార్షా బోగ్లే ఇలా
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications