Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పాకిస్థాన్‌తో యుద్ధం కావాలా?: ఇండో-పాక్ మ్యాచ్‌పై సెహ్వాగ్ వ్యాఖ్య

Virender Sehwag wants Team India to play against Pakistan in ICC World Cup 2019

హైదరాబాద్: ఇంగ్లాండ్‌లో జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌లో భారత్, పాకిస్థాన్ మధ్య జరిగే మ్యాచ్ యుద్ధం కన్నా తక్కువేమీ కాదని టీమిండియా మాజీ డాషింగ్ బ్యాట్స్‌మన్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. గోవా ఫెస్ట్‌లో పాల్గొన్న సెహ్వాగ్ వరల్డ్‌కప్‌లో పాక్‌తో భారత్‌ ఆడుతుందా? అన్న ప్రశ్నకు భిన్నంగా స్పందించాడు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

పాకిస్థాన్‌తో యుద్ధం కావాలా?

పాకిస్థాన్‌తో యుద్ధం కావాలా?

"ప్రస్తుతం రెండు అంశాల గురించి ఎక్కువగా చర్చించుకుంటున్నారు. పాకిస్థాన్‌తో యుద్ధం కావాలా? అని ఒకటి.. వద్దా? అని మరొకటి. ఈ రెండింటిలో ఏదో ఓ నిర్ణయం తీసుకుంటే పాక్‌తో మ్యాచ్ ఆడాలా? వద్దా? అనేది తేలిపోతుంది. ఇంకో రెండో విషయం ఏంటంటే దేశ సంక్షేమానికి ఏది మంచిదో అదే చేయాలి" అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.

ప్రపంచం మొత్తం ఈ మ్యాచ్ కోసం

ప్రపంచం మొత్తం ఈ మ్యాచ్ కోసం

"ఏదేమైనా పాక్‌తో మ్యాచ్ అంటే ఓ యుద్ధంతో సమానం. ఈ యుద్ధంలో గెలవాలి, ఓడిపోకూడదు. ఎందుకంటే ప్రపంచం మొత్తం ఈ మ్యాచ్ కోసం ఆసక్తికరంగా ఎదురుచూస్తుంటుంది. నా వరకైతే ఈసారి కూడా భారతే మ్యాచ్ గెలుస్తుందని అనుకుంటున్నా" అని సెహ్వాగ్ అన్నాడు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాక్‌తో మ్యాచ్ ఆడలంటూ కొందరు, మ్యాచ్ వద్దంటూ మరికొందరు రెండు వర్గాలుగా చీలిన సంగతి తెలిసిందే.

రాజకీయాల్లో చేరతారా అన్న ప్రశ్నకు

రాజకీయాల్లో చేరతారా అన్న ప్రశ్నకు

ఇక, రాజకీయాల్లో చేరతారా అన్న ప్రశ్నకు "తనకు ఏ పార్టీ మంచి కాంట్రాక్ట్ ఇస్తే అందులో చేరుతానన్నాడు. నెనెప్పుడూ ఒప్పందాలు కుదుర్చుకొని పనిచేస్తా. రంజీల నుంచి ఐపీఎల్‌ వరకు అదే చేశా. ఏ పార్టీ నాతో మంచి ఒప్పందం కుదుర్చుకుంటుందో దాంట్లో చేరిపోతా. అయితే ఈ ఒప్పందం విలువ రూ.100 కోట్లకు తక్కువగా ఉండొద్దు" అని సెహ్వాగ్ అన్నాడు.

Story first published: Saturday, April 13, 2019, 15:30 [IST]
Other articles published on Apr 13, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+