
రోహిత్ ఆట కోసం ఎదురుచూస్తున్నా:
తాజాగా వీరేంద్ర సెహ్వాగ్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఛాంపియన్‌షిప్ ఫైనల్ గురించి మాట్లాడాడు. 'బౌల్ట్, సౌథీ భారత జట్టుకు సవాళ్లు విసురుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇద్దరూ బంతిని రెండు వైపులా స్వింగ్ చేస్తారు. బౌల్ట్ బౌలింగ్‌ను రోహిత్ ఎలా ఎదుర్కొంటాడనేది ఆసక్తిగా ఉంటుంది. అందుకోసం నేను ఎదురుచూస్తున్నా. రోహిత్ అద్భుతమైన ఆటగాడు. 2014లోనూ అక్కడ టెస్టులు ఆడాడు. ఈసారి కూడా రాణిస్తాడనే నమ్మకముంది. ఇటీవలి కాలంలో ఓపెనర్‌గానూ బాగా ఆడుతున్నాడు. అయితే ఇతర ఓపెనర్ల లాగే తొలి పది ఓవర్లు జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఉంది. పరిస్థితులు ఎలా ఉన్నాయనే విషయాలను ముందే గ్రహించాలి. ఇక తర్వాత తనదైన శైలిలో షాట్లు ఆడుతూ పరుగులు చేయాలి' అని వీరూ అన్నాడు.

ఒకే సెషన్‌లో మ్యాచ్‌ను మలుపు తిప్పగలడు:
'రిషబ్ పంత్ బ్యాటింగ్ గురించి అతడికి స్పష్టమైన అవగాహన ఉంది. ఇతరులు ఏమనుకుంటున్నారనే విషయాలను పట్టించుకోకుండా తన ఆట మీదే దృష్టిసారించాలి. బ్యాటింగ్ చేసేటప్పుడు ఒక్కొక్క బంతి గురించే ఆలోచించాలి. ఒక బంతిని షాట్ ఆడాలనిపిస్తే.. ధైర్యంగా ఆడాలి. పంత్ తన బ్యాటింగ్ శైలిలో ఎలాంటి మార్పులు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికే తన ఆటతో అందర్నీ ఆకట్టుకున్నాడు. జట్టులో తన స్థానమేంటో అర్థం చేసుకున్నాడు. టీమిండియాలో కీలక ఆటగాడిగా మారాడు. ఆరో స్థానంలో బరిలోకి వచ్చి త్వరగా పరుగులు చేస్తుంటే.. ఒకే సెషన్‌లో మ్యాచ్‌ను మలుపు తిప్పగలడు' అని వీరేంద్ర సెహ్వాగ్ చెప్పాడు.

అశ్విన్, జడేజాలు తుది జట్టులో ఆడాలి:
'జూన్ 18న పిచ్ ఎలా ఉంటుందో నాకు తెలీదు. అయితే నేనెప్పుడూ ఒక విషయాన్ని బలంగా నమ్ముతా. పూర్తి బలమైన జట్టుతో ఆడాలి. భారత్ ఈ మ్యాచ్‌లో ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగాలి. అందులో ఇద్దరు స్పిన్నర్లు ఉంటే.. నాలుగు, ఐదు రోజుల్లో జట్టుకు కలిసివస్తుంది. ఈ విషయంలో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా సరైన ఆటగాళ్లు. వాళ్లు బ్యాటింగ్‌లోనూ ప్రభావం చూపుతారు. అప్పుడు అదనంగా మరో బ్యాట్స్‌మెన్ అవసరం ఉండదు' అని టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పేర్కొన్నాడు.

పుజారాకు స్ట్రైక్‌రేట్ అవసరం లేదు:
'టెస్టు క్రికెట్‌లో స్ట్రైక్‌రేట్ గురించి ఆలోచించాల్సిన పని లేదు. నేను టీమిండియాకు ఆడే రోజుల్లో నా వెనకాల రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్ బ్యాటింగ్ చేసేవాళ్లు. వాళ్లంతా ఈ ఫార్మాట్‌లో 50 స్ట్రైక్‌రేట్‌తోనే కొనసాగారు. ఇక్కడ అసలైన విషయం ఏమిటంటే క్రీజులో పాతుకుపోవడం. అందుకోసం పరుగులు చేస్తూ భాగస్వామ్యాలు నిర్మించాలి. కాబట్టి చేటేశ్వర్ పుజారా విషయంలో జట్టుకు పరుగులు చేస్తున్నంత కాలం నేను సంతోషంగానే ఉంటా. అక్కడ స్ట్రైక్‌రేట్ గురించి పట్టించుకోవాల్సిన పనిలేదు' అని వీరూ చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications












