మీ జీవితం రంగులమయంగా ఉండాలి: హ్యాపీ హోలీ అంటూ క్రికెటర్లు

హైదరాబాద్: గురువారం హోలీ సంబరాలు అంబరాన్ని అంటాయి. ప్రతి ఒక్కరూ రంగుల పండుగని ఘనంగా జరుపుకుంటున్నారు. హిందువులు జరుపుకునే ఈ హోలీ పండుగకి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇది రెండు రోజుల పండుగ. మొదటి రోజు హోళికా దహనం. అంటే రాక్షస రాజు హిరణ్యకశిపుడి సోదరి హోళిక దిష్టిబొమ్మను దగ్దం చేస్తారు.
ఇక, రెండో రోజు నీరు, రంగులు జల్లుకుంటూ హోలీ ఆడతారు. దిష్టబొమ్మ దహనం, రంగులు పూసుకోవడంలో హోలీకి ఎంతో ప్రత్యేకత ఉంది. హోలీ పండుగ సందర్భంగా పలువురు క్రికెటర్లు తమ అభిమానులకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. సహజ సిద్ధమైన రంగులు వాడాలని, పెంపుడు జంతువుల పట్ల జాగ్రత్త అవసరమని సూచించారు.
వీరేంద్ర సెహ్వాగ్
రంగులు చూసి భయపడకండి. రంగులు మార్చే వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. హ్యాపీ హోలీ. ప్రేమ, సామరస్యంతో జీవించండి.
సురేశ్ రైనా
అందరికీ హ్యాపీ, కలర్‌ఫుల్ హోలీ శుభాకాంక్షలు
బీసీసీఐ
టీమిండియా అభిమానులకు హోలీ శుభాకాంక్షలు
రోహిత్ శర్మ
ఈ హోలీ ప్రతి ఒక్కరి సంతోషాల పండుగ. మనతో పాటు మన స్నేహితులు, జంతువులకి కూడా.
దీపా కర్మాకర్
మీకు, మీ కుటుంబసభ్యులకు హృదయపూర్వక హోలీ శుభాకాంక్షలు

సైనా నెహ్వాల్
హోలీ సందర్భంగా భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ తన ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపింది.
వీవీఎస్ లక్ష్మణ్
హోలీలో రంగుల్లా మీ జీవితం అంతా రంగులమయం కావాలి. మీరు అనుకున్నది సాధించాలి. అందరికీ హోలీ శుభాకాంక్షలు
శిఖర్ ధావన్
రంగులు సంతోషాన్నిస్తాయి. మీ జీవితం ఎల్లప్పుడూ రంగులమయంగా ఉండాలి. హ్యాపీ హోలీ
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications