Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కేక్‌ని కత్తి స్టైల్‌లో కట్ చేయి: జడేజాకు సెహ్వాగ్ సూచన

హైదరాబాద్: డిసెంబర్ 6న ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా 29వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా పలువురు జడేజాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఎప్పటిలాగే టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్ తనదైన శైలిలో జడేజాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

Virender Sehwag urges birthday boy Ravindra Jadeja to cut cake in sword style celebration

ఈ మధ్య కాలంలో ట్విట్టర్‌లో అద్భుతమైన పంచ్‌లు వేస్తూ అభిమానుల్ని ఆకట్టుకోవడంలో వీరేంద్ర సెహ్వాగ్‌ ముందుంటాడు. జడేజా పుట్టిన రోజు సందర్భంగా సెహ్వాగ్ మరోసారి తన శైలిలో ట్వీట్ చేశాడు. బ్యాట్‌ని కత్తిలా తిప్పడమే కాదు... కత్తితో కేక్‌ను కూడా అదే విధంగా కోయాలంటూ సలహా ఇచ్చాడు.

ఇటీవల ముగిసిన మొహాలి టెస్టులో అర్ధ సెంచరీ పూర్తి చేసిన తర్వాత జడేజా మైదానంలో తన చేతిలో ఉన్న బ్యాట్‌ని కత్తిలా తిప్పిన సంగతి తెలిసిందే. అయితే కెప్టెన్ కోహ్లీ మేరకే చేసినట్లు మ్యాచ్ అనంతరం జడేజా స్పష్టం చేశాడు. టెస్టు క్రికెట్‌లో జడేజా రాణించిన ప్రతిసారీ కోహ్లీ పెవిలియన్ నుంచి ఉత్సాహపరుస్తుంటాడు.

ప్రధానంగా జడేజా అర్ధసెంచరీ చేసిన తర్వాత బ్యాటును కత్తిలా తిప్పమని కోరుతుంటాడు. అర్ధసెంచరీ చేసిన తర్వాత పెవిలియన్ వైపు చూసి అభివాదం చేయడం, అప్పుడు కోహ్లీ కోరినట్టు జడేజా బ్యాటును కత్తిలా తిప్పడం ఈ మధ్య జరుగుతోంది. తాజాగా మొహాలి టెస్టులో అర్ధ సెంచరీతో రాణించిన జడేజా... పెవిలియన్ వైపు చూడగా, బ్యాటుతో కత్తియుద్ధానికి ముందు చేసిన అభివాదం చేయమంటూ కోహ్లీ కోరాడు. దీంతో జడేజా బ్యాటును కత్తిలా తిప్పి స్టేడియంలోని అభిమానులను అలరించాడు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+