
హైదరాబాద్: భారత జట్టు మాజీ ఆటగాడు, టీ 10 మరాఠా అరేబియన్ జట్టు కెప్టెన్ వీరేంద్ర సెహ్వాగ్ ట్విట్టర్‌లో పోస్టులు ఆలోచింపజేసేలా ఉంటాయి. అందరిలా కాకుండా విభిన్న శైలిలో అతను చేసే ట్వీట్‌లు ఆసక్తికరంగా ఉంటాయి. తోటి ఆటగాళ్లపై సెటైర్లే కాదు.. సామాజిక అంశాలపై కూడా ఆయన తనదైన శైలిలో స్పందిస్తూ ఆకట్టుకుంటారు.
ఈ క్రమంలో కుల, మతాలపై వీరూ చేసిన ఓ పోస్టు ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటుంది. నిజానికి దానిని కొద్దిగా కొత్తగా సమకాలీన పద్ధతులకు అద్దం పట్టేలా ఉంది. ఆ సారాంశమేమంటే, దేవుడు, మనుషులు, ప్రేమ, మానవత్వం, మతం, కులం విషయాలపై సంక్లిష్ట రూపం.
వాట్సాప్‌లో ఓ గ్రూప్ చేశారు. దాని అడ్మిన్ గాడ్ (దేవుడు). ఆ గ్రూప్ పేరు ప్రపంచం ( వరల్డ్). అందులో దేవుడు మనుషులను యాడ్ చేశాడు. మనుషులతో పాటు ప్రేమని కలిపాడు. వారికి మానవత్వాన్ని తోడు చేశాడు. అయితే మనుషులు కులాలను తీసుకొచ్చారు. వాటి నుంచి మతాలు అనే భేదభావాన్ని మోసుకొచ్చారు. వీటి ముందు ప్రేమ నిలవలేక పోయింది. మత భావాలకు భయపడి మానవత్వం తప్పుకుంది. చివరకు దేవుడు ఓడిపోయాడు. ప్రపంచం నుంచి తప్పుకున్నాడు.
ఆలోచింపజేసేలా ఉండటంతో ఫ్యాన్స్, సెలబ్రిటీలు కూడా మళ్లీ దానిని రీ ట్వీట్ చేస్తూ షేర్ చేస్తున్నారు. ఇది ఒక సంక్లిష్ట సందేశం.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.