బర్త్ డేను ఆ పద్దతిలో సెలబ్రేట్ చేసుకోవద్దు: సెహ్వాగ్

బర్త్ డేను అందరూ బాధ్యతాయుతంగా చేసుకోవాలి. బర్త్ డే జరుపుకుంటున్న సమయంలో బర్త్ డే బంప్స్ లాంటివి చేయకూడదని టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ విజ్ఞప్తి చేశారు. ఈ మధ్య కాలంలో బర్త్ డే ఈవెంట్లలో కేక్ కటింగ్‌తో పాటు బర్త్ డే బంప్స్ ఇస్తున్నారు. ఇపుడు ఇదే ట్రెండ్ నడుస్తోంది. ఇలాంటి సెలబ్రేషన్‌లో తాజాగా ఓ స్టూడెంట్ చనిపోయాడు.
అయితే స్టూడెంట్ పుట్టిన రోజు సంబరాల్లో భాగంగా చితకబాదించుకున్న వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియో కాస్త మన వీరేంద్ర సెహ్వాగ్ కంట పడింది. సోషల్ మీడియాలో చురుకుగా ఉండే సెహ్వాగ్ ఊరుకుంటాడా. ఆ వీడియో షేర్ చేసి అందరికి ఓ విజ్ఞప్తి చేసాడు.
'ఇది చాలా బాధాకరం. ఒక స్టూడెంట్ బర్త్ డే బంప్స్ ఇవ్వడంతో చనిపోయాడు. ఇలాంటి పద్ధతిలో బర్త్ డేలు సెలబ్రేట్ చేసుకోవద్దు. బర్త్ డేను అందరూ బాధ్యతాయుతంగా చేసుకోవాలి. బర్త్ డే జరుపుకుంటున్న సమయంలో బర్త్ డే బంప్స్ లాంటివి చేయకూడదు. ఇది ఎవరికీ సరదాగా అనిపించదు' అని సెహ్వాగ్ ట్వీటాడు. ట్వీట్ చేసిన కొద్ది సమయానికే సెహ్వాగ్ ఆ ట్వీట్ డిలీట్ చేసాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications