39వ పడిలోకి సెహ్వాగ్: బెస్ట్ ట్వీట్ ఎవరిదో తెలుసా?
హైదరాబాద్: వీరేంద్ర సెహ్వాగ్... భారత ఓపెనర్లకు దూకుడుని నేర్పిన డాషింగ్ ఓపెనర్. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్‌తో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దిగి టీమిండియాకు ఎన్నో ఘన విజయాలను అందించాడు. అలాంటి సెహ్వాగ్ శుక్రవారం 39వ పుట్టినరోజుని జరుపుకుంటున్నాడు.
సెహ్వాగ్‌కు పుట్టినరోజు సందర్భంగా మాజీ క్రికెటర్లతో పాటు ప్రస్తుత క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అనంతరం సెహ్వాగ్ తనదైన శైలిలో అభిమానులను అలరిస్తూనే ఉన్నాడు.
ప్రస్తుతం కామెంటేటర్‌గా విధులు నిర్వహిస్తున్న సెహ్వాగ్ 1999లో పాక్‌పై అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. భారత్ తరుపున 104 టెస్టులాడిన సెహ్వాగ్ 49.34 యావరేజితో 8,586 పరుగులు చేశాడు. ఇక 251 వన్డేల్లో 35.05 యావరేజితో 8,273 పరుగులు సాధించాడు.
2004లో పాక్‌పై టెస్టుల్లో తొలి ట్రిపుల్ సెంచరీ చేసిన భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. దీంతో పాటు 2011లో వెస్టిండీస్‌పై ఇండోర్‌లో జరిగిన వన్డేలో 149 బంతుల్లో 219 పరుగులు చేసి వన్డేల్లోనూ భారత్ తరఫున తొలి డబుల్ సెంచరీ చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.
2013లో భారత్ తరుపున చివరిసారిగా బరిలోకి దిగాడు. ఇక, టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ, వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా సెహ్వాగ్ చరిత్ర సృష్టించాడు.
సచిన్ టెండూల్కర్
టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పుట్టినరోజుని పురస్కరించుకుని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ వినూత్నంగా ట్వీట్ చేశాడు.
సురేశ్ రైనా
బౌలర్లకు ఎన్నో నిద్రపట్టిని రాత్రులు మిగిల్చి, విధ్వంసానికి మారుపేరుగా నిలిచిన సెహ్వాగ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు
అనిల్ కుంబ్లే
హ్యాపీ బర్త్ డే సెహ్వాగ్
విజేందర్ సింగ్
ఎప్పుడైతే సెహ్వాగ్ క్రికెట్ ఆడటం మానేశాడో... అప్పట్నుంచే నేను ఇంట్లో కూర్చుని క్రికెట్ చూడటం మానేశా. హ్యాపీ బర్త్ డే సెహ్వాగ్
పార్ధీవ్ పటేల్
వీరూ పా నువ్వు మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నా
మిథున్ మన్‌హాస్
గోల్డెన్ హార్ట్ కలిగిన లెజండ్ వీరూకి పుట్టిన రోజు శుభాకాంక్షలు
క్రిస్ గేల్
హ్యాపీ బర్త్ డే లెజండ్. మరింత కాలం నిన్ను చూసేలా దేవుడు దీవించాలని కోరుకుంటున్నా
అజ్యింకె రహానే
హ్యాపీ బర్త్ డే వీరూ. ఫియర్‌లెస్ అన్న పదానికి అర్ధం చెప్పినందుకు ధన్యవాదాలు. నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉండి నీ త్రిశతకాన్ని చూడగలిగాను
ఇషాంత్ శర్మ
క్రికెట్ చరిత్రలో విధ్వంసకరమైన ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా పేరు తెచ్చుకున్న వీరూకి హ్యాపీ బర్త్ డే. వ్యాఖ్యాతగా నువ్వు మమ్మల్ని ఇలాగే నవ్విస్తూ ఉండు
ఐసీసీ
అంతర్జాతీయ క్రికెట్‌లో 17,253 పరుగులు, టెస్టుల్లో రెండు ట్రిపుల్ సెంచరీలు, వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన రెండో ఆటగాడైన వీరేంద్ర సెహ్వాగ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications