Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: 'పేదవాళ్లను కూడా పైన ఉండనివ్వండి'.. ఆర్సీబీని ఎగతాళి చేసిన సెహ్వాగ్

IPL 2025: ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మంచి ఫామ్‌లో ఉంది. ఆర్సీబీ ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు ఆడి రెండింటిలోనూ విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. కానీ భారత మాజీ లెజెండ్ వీరేంద్ర సెహ్వాగ్ ఆర్సీబీ అగ్రస్థానంలో ఉండడం పట్ల సంతోషంగా ఉన్నట్లు అనిపించడం లేదు. వీరేంద్ర సెహ్వాగ్ ఇటీవల ఆర్సీబీని ఎగతాళి చేస్తూన కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది. అయితే వీరేంద్ర సెహ్వాగ్ ఈ విధంగా ఆర్సీబీని ఎగతాళి చేయడం అభిమానులకు నచ్చడం లేదు.

ఆర్సీబీని ఎగతాళి చేసిన సెహ్వాగ్
ఆర్సీబీ జట్టు ఇప్పటివరకు ఒక్క ఐపీఎల్ ట్రోఫీని కూడా గెలవలేదు. కానీ సీజన్ 18లో రజత్ పాటిదార్ కెప్టెన్సీలో జట్టు మంచి ఫామ్ లో ఉంది. అయినప్పటికీ వీరేంద్ర సెహ్వాగ్ ఆర్సీబీని ఎగతాళి చేస్తూ కనిపించాడు. క్రిక్‌బజ్ లో సెహ్వాగ్ మాట్లాడుతూ.. "పేదవాళ్లను కూడా పైన ఉండనివ్వండి.. కొంతకాలం ఫోటోలు తీసుకోనివ్వండి.. పేదవాళ్లు ఎంతసేపు పైన ఉంటారో ఎవరికి తెలుసు." అంటూ ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండడంపై వీరేంద్ర సెహ్వాగ్ ఎగతాళి చేశాడు.

Virender Sehwag Trolls RCB - Let the Poor Be on Top RCB Fans React

అనంతరం దాని గురించి సెహ్వాగ్ వివరిస్తూ.."నేను డబ్బు గురించి మాట్లాడడం లేదు. వారందరూ డబ్బుపరంగా ధనవంతులు. ఫ్రాంచైజీలు ప్రతి సీజన్ లో 400-500 కోట్లు సంపాదిస్తాయి. నేను దాని గురించి మాట్లాడటం లేదు. ఒక్క ట్రోఫీ కూడా గెలవని వారిని నేను పేదలు అని పిలుస్తున్నాను" అని సెహ్వాగ్ అన్నాడు. సెహ్వాగ్ ప్రకటన తర్వాత ఆర్సీబీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనంతరం ఫ్యాన్స్ కూడా సెహ్వాగ్ వీడియోపై మాట్లాడడం ప్రారంభించారు.

3సార్లు ఫైనల్‌కు చేరుకున్న ఆర్సీబీ
ఐపీఎల్ 2008లో ప్రారంభమైంది. అప్పటి నుంచి ఆర్సీబీ 3 సార్లు ఐపీఎల్ ఫైనల్స్‌కు చేరుకుంది. కానీ ఇప్పటివరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ట్రోఫీని గెలుచుకోలేకపోయింది. దీని కారణంగా జట్టు తరచుగా ట్రోలింగ్‌ను ఎదుర్కోవలసి ఉంటుంది. కానీ ఈ సారి టైటిల్ గెలుచుకోవడానికి ఆర్సీబీ బలమైన పోటీదారుగా కనిపిస్తోంది. ప్రతి సీజన్ లోనూ ఆర్సీబీ బౌలింగ్ బలహీనంగా ఉండేది. కానీ ఈ సారి జట్టు బౌలింగ్ చాలా బలంగా కనిపిస్తోంది.

Story first published: Tuesday, April 1, 2025, 15:38 [IST]
Other articles published on Apr 1, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+