Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తుంటరి అభిమాని విషెస్‌కు సరదాగా రిప్లై ఇచ్చిన సెహ్వాగ్

న్యూఢిల్లీ: క్రికెట్ ఆడినన్ని రోజులు బ్యాట్‌తో అలరించిన టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్... క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత ట్విట్టర్‌లో తన సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించాడు. గత కొన్ని నెలలుగా ట్విట్టర్‌లో తనదైన శైలిలో పోస్టులు పెడుతూ, అటు అభిమానులతో పాటు ఇటు సహచర క్రికెటర్లను అలరిస్తున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అక్టోబర్ 20(గురువారం)నాడు తేదీన సెహ్వాగ్ 38వ పుట్టినరోజుని జరుపుకున్నాడు. తన పుట్టినరోజు సందర్భంగా #AskSehwag ట్యాగ్ పెట్టి, తనని ఏమైనా ప్రశ్నలు అడగాలని ఉందా అని పోస్ట్ చేశాడు. దీంతో పలువురి అభిమానులు వేసిన ప్రశ్నలకు సెహ్వాగ్ ఓపిగ్గా సమాధానాలిచ్చాడు.

Virender Sehwag Trolls Fan Who Wished Him Two Days After His 38th Birthday

అయతే ఓ అభిమాని సెహ్వాగ్ పుట్టినరోజుని మరిచిపోయాడు. సెహ్వాగ్ పుట్టినరోజు ముగిసిన రెండు రోజులకు దేవరాజన్ అనే అభిమాని (అక్టోబర్ 22న) హ్యాపీ బర్త్ డే వీరూ అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ పై స్పందించిన సెహ్వాగ్ "ఇంకా 363 రోజులు ఉంది బాబూ. చాలా తొందరగా గ్రీటింగ్స్ చెప్పావు. అయినా ఓకే. థాంక్యూ" అంటూ సరదాగా రీప్లై ఇచ్చాడు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ఐదు వన్డేల సిరిస్‌లో సెహ్వాగ్ కామెంటటర్‌గా వ్యవహారిస్తున్నాడు. ఇండియా-న్యూజిలాండ్ మధ్య ఆదివారం నాడు జరగనున్న మూడో వన్డేలో సెహ్వాగ్ కామెంటేటర్‌‌గా సెహ్వాగా కనిపించనున్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+