హైదరాబాద్: ట్విట్టర్ కింగ్‌గా పేరొందిన వీరేంద్ర సెహ్వాగ్ ఇంగ్లాండ్‌తో ముగిసిన టెస్టు, వన్డే టీ20 సిరిస్‌లను కైవసం చేసుకున్న కోహ్లీ నేతృత్వంలోని టీమిండియాకు వినూత్నగా శుభాకాంక్షలు తెలియజేశాడు. ట్విట్టర్‌లో సెహ్వాగ్ ఓ ఫన్నీ వీడియోని పోస్టు చేశాడు.
ఆ వీడియోలో ఒక సెహ్వాగ్ టీవీ ఎక్స్‌పర్ట్‌గా... ఇంకో సెహ్వాగ్ దేశీ, ట్రెండీ జాట్ కుర్రాడిగా ద్విపాత్రాభినయం చేశాడు. ఈ వీడియోకి 'ప్రతి అంశం వెనకాల ఏంటీ, ఎలా, ఎందుకు' అంటూ తన ట్విట్టర్ ఖాతాలో కామెంట్ రాసి పోస్టు చేశాడు.
టీవీ ఎక్స్‌పర్ట్‌గా ఉన్న కోహ్లీ సేన టెస్టు, వన్డే, టీ20 సిరిస్‌లను ఎలా కైవసం చేసుకుందో వివరిస్తుంటే, దేశీ సెహ్వాగ్ మాత్రం తమాషా కారణాలు చెప్పి నవ్వించాడు. చివర్లో కహో నా ప్యార్ హై సినిమాలోని 'ఖాళీ హాత్ ఆయీ తి, ఖాళీ హత్ ఛల్ దియీ' (ఉత్త చేతులతో వచ్చారు, ఉత్త చేతులతో వెళ్లారు) అనే పాట పాడి ఇంగ్లాండ్‌పై తన హాస్య చతురతను ప్రదర్శించాడు.
ఇద్దరు సెహ్వాగ్‌లు కూడా టీమిండియా ప్రదర్శనపై ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా సుదీర్ఘ భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్ జట్టుని ఉత్త చేతులతో తిరిగి పంపడంలో కీలకపాత్ర పోషించిన టీమిండియా ఆటగాళ్లపై ప్రశంసలు కురిపించారు. భారత్ తరుపున తొలి ట్రిపుల్ సెంచరీ సాధించిన సెహ్వాగ్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు పలికిన తర్వాత కామెంటేటర్‌గా సెటిలైన సంగతి తెలిసిందే.