న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్విట్టర్‌లో సెకండ్ ఇన్నింగ్స్‌ని ప్రారంభించాడు. అదను చిక్కినప్పుడుల్లా ట్విట్టర్‌లో తనదైన శైలిలో మాజీలతో పాటు ప్రస్తుత క్రికెటర్లపై సెటైర్లు సంధిస్తున్నాడు.
తాజాగా ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ ఆండర్సన్‌పై సెహ్వాగ్ ట్విట్టర్ వేదికదా తన చమత్కారాన్ని ప్రదర్శించాడు. విశాఖ వేదికగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన రెండో టెస్టులో ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ రెండు సార్లు గోల్డెన్ డకౌటయ్యాడు. దీనిని 'కింగ్ పెయిర్' అంటారు.
ఈ 'కింగ్ పెయిర్' అస్త్రాన్ని సెహ్వాగ్.. జేమ్స్ ఆండర్సన్‌పై ప్రయోగించాడు. రెండో టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లో కూడా జేమ్స్ ఆండర్సన్ తాను ఎదుర్కొన్న తొలి బంతికే పెవిలియన్‌కు చేరడం విశేషం. sssగత వందేళ్లలో ఇలా కింగ్స్ పెయిర్ సాధించిన ఏకైక ఇంగ్లిష్ క్రికెటర్‌గా ఆండర్సన్ అప్రతిష్ట మూటగట్టుకున్నాడు.
జేమ్స్ ఆండర్సన్ 'కింగ్ పెయిర్' ఔటవడాన్ని సెహ్వాగ్ 'కర్మ'తో పోల్చాడు. ఇంగ్లాండ్ తరఫున చివరగా 1906లో కేప్‌టౌన్‌లో దక్షిణాఫ్రికాపై ఎర్నీ హేస్ అనే బ్యాట్స్‌మెన్ 'కింగ్ పెయిర్' అయ్యాడు. ఐదేళ్ల కిందట తనను డకౌట్ చేసిన ఆండర్సన్.. తాను ఆర్యభట్టకు నివాళి అర్పించేలా చేశాడని.. ఇప్పుడు ఇదే పరిస్థితి అతనికీ ఎదురైందని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.
ఐదేళ్ల తర్వాత జేమ్స్‌ను ఆట పట్టించడానికి వచ్చిన అవకాశాన్ని సెహ్వాగ్ ఇలా ట్వీట్ ద్వారా ఉపయోగించుకున్నాడని అభిమానులు సంతోషంగా ఉన్నారు. దీన్ని స్పోర్టింగ్ స్పిరిట్‌తోనే తీసుకున్న ఆండర్సన్ కూడా ఓ కన్నీళ్లు పెట్టుకున్న ఓ ఎమోజీతో రీట్వీట్ చేశాడు.
తొలి ఇన్నింగ్స్‌లో జేమ్స్ ఆండర్సన్‌ను స్పిన్నర్ రవిచంద్రన్ పెవిలియన్‌కు పంపగా, రెండో ఇన్నింగ్స్‌లో విశాఖ టెస్టుతో అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన జయంత్ యాదవ్ తొలి బంతికే పెవిలియన్‌కు పంపాడు. కాగా, 2011లో ఇంగ్లాండ్‌తో మ్యాచ్ సందర్భంగా సెహ్వాగ్ తొలి ఇన్నింగ్స్‌లో తొలి బంతికే బ్రాడ్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరగా, రెండో ఇన్నింగ్స్‌లో అండర్సన్ బౌలింగ్‌లో తొలి బంతికి పెవిలియన్ చేరాడు.