
భారత క్రికెటర్లలో సెహ్వాగ్ మూడో స్ధానం
దీంతో ట్విట్టర్‌లో ఎక్కువ మంది ఫాలో అవుతున్న భారత క్రికెటర్లలో సెహ్వాగ్ మూడో స్ధానంలో నిలిచాడు. ఈ జాబితాలో ప్రస్తుతం టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ ధోనికి కూడా లేని ఫాలోవర్లు సెహ్వాగ్‌కు ఉన్నారు. అయితే టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం వీరిద్దరికీ అందనంత దూరంలో ఉన్నాడు.

13.9 కోట్లతో అగ్రస్ధానంలో సచిన్ టెండూల్కర్
ప్రస్తుతం ట్విట్టర్‌లో ఎక్కువ మంది ఫాలో అవుతున్న భారత క్రికెటర్లలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ 13.9 కోట్లతో అగ్రస్ధానంలో ఉండగా ఆ తర్వాతి స్ధానంలో విరాట్ కోహ్లి 1.34కోట్లతో ఉన్నాడు. ఇక భారత పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి 58.29లక్షలు, ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌కి 41.45 లక్షల ఫాలోవర్లు ఉన్నారు.

సందర్భాన్ని బట్టి తన బుర్రకు పని చెబుతూ ట్వీట్లకి
హాస్యచతురత జోడించి క్రికెటర్లు, సినీ, రాజకీయ ప్రముఖులకు నజఫ్‌గడ్ నవాబ్ అయిన సెహ్వాగ్ చెప్తున్న పుట్టినరోజు శుభాకాంక్షలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. దీంతో ట్విట్టర్‌లో సెహ్వాగ్‌కు ఒక్కసారిగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతోంది.

ఎంతలా అంటే భారత క్రికెటర్ గౌతమ్ గంభీర్ తనకు
పుట్టినరోజు శుభాకాంక్షలను సెహ్వాగ్ సాధారణంగా చెప్పడంతో నొచ్చుకుని మరీ తనదైన పంచ్‌లతో విషెష్ చెప్పాలంటూ అప్పట్లో కోరాడు. మరోవైపు అభిమానులు సైతం ఏదైనా ప్రత్యేకత ఉన్న రోజైతే సెహ్వాగ్ ఎలాంటి ట్వీట్ పెడతాడో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


Click it and Unblock the Notifications











