ఆసీస్ స్కోరు మీద జీఎస్టీ విధించడం వల్లే భారత్ ఓటమి: సెహ్వాగ్ సరదా ట్వీట్

హైదరాబాద్: బ్రిస్బేన్ వేదికగా ఆతిథ్య ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో టీమిండియా 4 పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కంటే టీమిండియా ఎక్కువ పరుగులు చేసినప్పటికీ ఓటమి పాలైంది. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ని 17 ఓవర్లకు కుదించారు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తోలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 17 ఓవర్లకు చేసింది 158/4.
అనంతరం డక్‌వర్త్ లూయిస్ ప్రకారం టీమిండియాకు 174 పరుగుల లక్ష్యం నిర్దేశించారు. దీంతో లక్ష్య చేధనలో టీమిండియా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 169 పరుగులు మాత్రమే చేయగలిగింది. చివరి వరకు ఉత్కంఠకరంగా సాగినప్పటికీ, వరుస బంతుల్లో కృనాల్ పాండ్యా, దినేశ్ కార్తీక్ ఔట్ కావడంతో భారత ఓటమి తప్పలేదు.

డక్‌వర్త్ లూయిస్‌పై భారత క్రికెట్ అభిమానులు మండిపాటు
దీంతో తొలి టీ20లో టీమిండియా ఓటమికి కారణమైన డక్‌వర్త్ లూయిస్ విధానంపై భారత క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. ఆస్ట్రేలియా కంటే ఎక్కువ పరుగులు చేసినప్పటికీ భారత్ ఓడిపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. "ప్రత్యర్ధి జట్టు కంటే 11 పరుగులు ఎక్కువగా చేసిన జట్టు 4 పరుగుల తేడాతో ఓడిపోయింది" అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.
సెహ్వాగ్ తనదైన శైలిలో ట్విట్
తొలి టీ20లో టీమిండియా ఓటమిపై మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో ట్విట్టర్‌లో స్పందించాడు. సెహ్వాగ్ ట్వీట్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. "ఆస్ట్రేలియా కంటే ఎక్కువ పరుగులు చేసినప్పటికీ భారత్ ఓడిపోయింది. ఆస్ట్రేలియా స్కోరు మీద జీఎస్టీ(వస్తు సేవల పన్ను) విధించడం వల్లే టీమిండియా ఓడిపోయింది. ఏదేమైనప్పటికీ సిరీస్ ఆరంభ మ్యాచ్ మజా అందించింది" అని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.

శుక్రవారం మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో రెండో టీ20
ఈ విజయంతో మూడు టీ20ల సిరిస్‌లో ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. భారత బ్యాట్స్‌మెన్లలో ఓపెనర్ శిఖర్ ధావన్ (76) హాఫ్ సెంచరీతో చేయగా, చివర్లో దినేష్ కార్తీక్ (13 బంతుల్లో 30) మెరుపు ఇన్నింగ్స్ ఆడినప్పటికీ.. భారత్‌ను ఓటమి నుంచి తప్పించలేకపోయారు. రెండో టీ20 శుక్రవారం మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరగనుంది.
సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర విమర్శలు
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో భారత ఫీల్డర్లు రెండు క్యాచ్‌లు జారవిడచడంతో ఆసీస్ జట్టు భారీ స్కోరు చేయగలిగింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన రోహిత్ శర్మ (7), విరాట్ కోహ్లీ (4) పేలవ ప్రదర్శనతో నిరాశపరిచారు. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications