అరవై బంతులు కూడా ఆడని గంభీర్‌కు అన్ని కోట్లా!: సెహ్వాగ్
హైదరాబాద్: వీరేంద్ర సెహ్వాగ్. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత ట్విట్టర్‌లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. తన బ్యాట్‌తో ప్రపంచ క్రికెట్‌లో ఎన్నో రికార్డులు నమోదు చేసిన సెహ్వాగ్ ప్రస్తుతం మాటలతో సత్తా చాటుతున్నాడు. ఎప్పుడూ ట్విట్టర్‌లో హాస్యం పండించే సెహ్వాగ్ తాజాగా జట్టు సహచరుడు గౌతం గంభీర్‌పై సెటైర్ వేశాడు.
ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మ కనీస ధరను రూ. 2 కోట్లుగా నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే వేలంలో ఇషాంత్‌ను కొనుగోలు చేసేందుకు ఏ ఒక్క ప్రాంఛైజీ కూడా ఆసక్తి చూపని సంగతి తెలిసిందే. ఇషాంత్ కనీస ధరను ఎక్కువగా నిర్ణయించడం వల్లే వేలంలో అతడు అమ్ముడుపోలేదని గంభీర్ అనుచితమైన వ్యాఖ్య చేశాడు.

ఇషాంత్ కనీస ధరను చూసి ఆశ్చర్యానికి లోనైన గంభీర్
'ఇషాంత్ కనీస ధరను చూసి ఆశ్చర్యానికి లోనయ్యా. నిజం చెప్పాలంటే అది చాలా ఎక్కువ' అని గంభీర్ అన్నాడు. అంతేకాదు తాను ఆ విధంగా మాట్లాడటానికి గల కారణాలను సైతం గంభీర్ వెల్లడించాడు. ఐపీఎల్‌లో టీ20 టోర్నీ. ఈ మ్యాచ్‌లో ఇషాంత్ కేవలం 4 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేస్తాడు.

ఇషాంత్ శర్మను తీసుకున్న పంజాబ్ జట్టు
అదే బెన్ స్టోక్స్ లాంటి ఆటగాళ్ల కనీస ధరను రూ. 2 కోట్లు నిర్ణయించడం వెనుక అతడు బ్యాటింగ్, బౌలింగ్ తో పాటు ఫీల్డింగ్ కూడా రాణిస్తాడని గంభీర్ చెప్పుకొచ్చాడు. అయితే గంభీర్ వ్యాఖ్యలను మొదట్లో ఎవరూ పట్టించుకోలేదు. అయితే ఐపీఎల్ ప్రారంభ వేడుకలకు రెండు రోజుల ముందు ఇషాంత్ శర్మను పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టు తీసుకుంది.

గంభీర్‌పై సెహ్వాగ్ సెటైర్
ఇషాంత్ శర్మకు కనీస ధరను చెల్లిస్తూ ఒప్పందం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆ జట్టు క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్‌గా ఉన్న సెహ్వాగ్ వద్ద గంభీర్ వ్యాఖ్యను ప్రస్తావించింది మీడియా. దీనిపై వెంటనే స్పందించిన సెహ్వాగ్ ‘అవునా.. మరి అరవై బంతులు కూడా ఆడని నీ కోసం పన్నెండు కోట్ల రూపాయలు ఎవరు పే చేస్తున్నారు?' అని వ్యాఖ్యానించాడు.

ఆటగాళ్లకు మద్దతుగా నిలుస్తున్న ప్రాంఛైజీలు
ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 10వ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో ఎవరి టీమ్‌లు వారివి. తమ జట్టు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలవాలంటే తమ జట్టు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలవాలంటూ ఒకరికొకరు పోటీ పడుతున్నారు. విశేషం ఏమిటంటే ఈ ఇద్దరూ ఢిల్లీకి చెందిన వారు. టీమిండియా తరుపున అనేక మ్యాచ్‌ల్లో ఓపెనర్లుగా బరిలో దిగారు. ప్రత్యర్థి జట్లపై విలువైన భాగస్వామ్యాలను నమోదు చేసిన టీమిండియాకు అనేక విజయాలను సైతం అందించారు.
ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 10వ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో ఎవరి టీమ్‌లు వారివి. తమ జట్టు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలవాలంటే తమ జట్టు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలవాలంటూ ఒకరికొకరు పోటీ పడుతున్నారు. విశేషం ఏమిటంటే ఈ ఇద్దరూ ఢిల్లీకి చెందిన వారు. టీమిండియా తరుపున అనేక మ్యాచ్‌ల్లో ఓపెనర్లుగా బరిలో దిగారు. ప్రత్యర్థి జట్లపై విలువైన భాగస్వామ్యాలను నమోదు చేసిన టీమిండియాకు అనేక విజయాలను సైతం అందించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications